BigTV English
Advertisement

Mr. X Teaser: మన దేశానికి తెలియకుండా మన దేశాన్నే కాపాడే సీక్రెట్ ఏజెంట్.. మిస్టర్ ఎక్స్

Mr. X Teaser: మన దేశానికి తెలియకుండా మన దేశాన్నే కాపాడే సీక్రెట్ ఏజెంట్.. మిస్టర్ ఎక్స్

Mr. X Teaser: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఆర్య కూడా ఒకడు. తెలుగులో వరుడు సినిమాలో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చిన ఆర్య.. ఆ తరువాత రాజారాణి సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు.  మంచి మంచి కథలను ఎంచుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.  గతేడాది సైంధవ్ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించిన ఆర్య.. తాజాగా మిస్టర్ ఎక్స్ అనే సినిమాతో రాబోతున్నాడు. 


ఆర్య, గౌతమ్ కార్తీక్, మంజు వారియర్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మిస్టర్ ఎక్స్.  మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుజ్ఞ, రైజా విల్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం  కోసం స్పై లు ఎలా కష్టపడుతున్నారు అనేది టీజర్ లో చూపించారు.

టీజర్ మొదటిలోనే భారతీయ  గూఢచర్య వీరుల జీవితాలు, త్యాగాల ఆధారంగా రాయబడ్డ కథ అని చెప్పి ఆసక్తి పెంచేశారు. “దేశాన్ని కాపాడడం మన పని మాత్రమే కాదు. అది మన బాధ్యత” అని మంజు వారియర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. దేశంలో ఎలాంటి దాడులు జరగకుండా ఒక న్యూక్లియర్ డివైజ్ ను చాలా పకడ్బందీగా ప్రభుత్వం దాస్తూ వస్తుంది. అయితే కొంతమంది దుండగులు ఆ డివైజ్ ను దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ డివైజ్ చేతిలో ఉంటే.. దేశంలో ఎక్కడైనా దాడి జరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో చేసేది ఏమి లేక అధికారులు.. ఆ డివైజ్ ను కాపాడే పని కోసం మిస్టర్ ఎక్స్ ను రంగంలోకి దింపుతారు.


న్యాచురల్ నాని బర్త్ డే స్పెషల్.. ఆయన హిట్ మూవీస్ పై ఓ లుక్ వెయ్యండి

మిస్టర్ ఎక్స్.. మన దేశానికి తెలియకుండా మన దేశాన్నే కాపాడే సీక్రెట్ ఏజెంట్. అతనికి మిషన్ ను అప్పగిస్తే చాలు. అది పూర్తయ్యేవరకు నిద్రపోడు. అలాంటి ఒక స్పైనే ఆర్య. అయితే ఆ సీక్రెట్ ఏజెంట్స్ లోనే ఒక ద్రోహి ఉంటాడు. అతడే ఈ డివైజ్ గురించి శత్రువులకు లీక్ ఇస్తాడు. ఆ ద్రోహి ఎవరు.. ? ఆ డివైజ్ ను ఆర్య కాపాడాడా.. ? గౌతమ్ కార్తీక్ ఎందుకు ఆర్య వెంటపడుతున్నాడు.. ? ఈ సీక్రెట్ మిషన్ కు  ఆర్య కుటుంబానికి ఉన్న  సంబంధం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

స్పై మూవీస్ అంటే ఈ మధ్యకాలంలో చాలా ఆసక్తి కనపరుస్తున్నారు అభిమానులు. అందులోనూ నిజంగా జరిగిన కథల నుంచి  తీసుకున్న కథ కావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఒక స్పై గా ఆర్య పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ బాడీ.. లుక్ అదిరిపోయింది. గౌతమ్ కార్తిక్ మిస్టరీ మ్యాన్ లా కనిపించాడు. ఇక మంజు వారియర్ ఆర్యకు బాస్ లా కనిపించింది. టోటల్ గా టీజర్ లో యాక్షన్ తో పిచ్చెక్కించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×