BigTV English

Rashmika Mandanna : మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక… స్టార్ హీరోతో రెండవసారి రొమాన్స్

Rashmika Mandanna : మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక… స్టార్ హీరోతో రెండవసారి రొమాన్స్

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ కనీసం ఆ సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేని విధంగా రాత్రి పగలు సినిమాల షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనే గుడ్ న్యూస్ ఆమె అభిమానుల కోసం వచ్చేసింది.


మరో పాన్ ఇండియా సినిమాలో రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘ఛలో’ నుంచి ‘పుష్ప 2’ వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సినిమాలు చేసింది. ఇక ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా ఈ బ్యూటీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆమె ఫాలోయింగ్ కు తగ్గటే టాలీవుడ్ తో పాటు మరో బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు తలుపు తట్టడం మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్లలో రష్మిక మందన్న టాప్ ప్లేస్ లో ఉంది. తాజాగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి మరో బిగ్ ప్రాజెక్టులో ఈ అమ్మడు అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.


ఇప్పటికే రష్మిక మందన్న (Rashmika Mandanna) మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’ (Sikandar) షూటింగ్లో బిజీగా ఉంది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ బ్యూటీ మరో బిగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండడం విశేషం. అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ అట్లీతో పాటు హీరో సల్మాన్ ఖాన్ కూడా భారీ రెమ్యూనరేషన్ వసూలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.

బాలీవుడ్లో వరుస అవకాశాలు

‘పుష్ప’ నుంచి మొదలు పెడితే రష్మిక మందన్న వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వస్తోంది. ‘పుష్ప’ తర్వాత ‘యానిమల్’ మూవీతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే ‘పుష్ప 2’ మూవీ తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా ఆడిన సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే కానుకగా ఆమె నటించిన హిందీ పీరియాడికల్ డ్రామా ‘ఛావా’ రిలీజ్ కాబోతోంది. ఈద్ కానుకగా రష్మిక మందన్న – సల్మాన్ ఖాన్ జంటగా నటించిన ‘సికందర్’ మూవీ రిలీజ్ కానుంది. అంతలోనే సల్మాన్ ఖాన్ తో మరో ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×