Rahul Gandhi TG Visit: ఫిబ్రవరి రెండవ వారంలో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూర్యపేట జిల్లాలో పర్యటించనున్నట్లు, ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ వద్ద మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. పలు కీలక విషయాలను వెల్లడించారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా జిహెచ్ఎంసిలో అత్యధిక సీట్లు గెలిచి మేయర్ పిఠాన్ని మరోసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్నా సమానత్వం కోసం సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నామని, కుల గణనను ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసిన పూర్తి చేశామన్నారు.
ఫిబ్రవరి 5న కులగనన రిపోర్టు క్యాబినెట్ సబ్ కమిటీ కి అందుతుందని, రిజర్వేషన్ల పెంపుపై క్యాబినెట్ లో చర్చిస్తామని పీసీసీ చీఫ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దూర దృష్టితో విదేశీ కంపెనీల నుండి పెట్టుబడును సాధించిందని, టిఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిన వైనాన్ని రియల్టర్లు గమనించాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తుందని, బీఆర్ఎస్ మాదిరిగా హామీలు అమలు చేయకుండా తాము వదిలి వేయలేదన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లతో అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు, రెండు మూడు రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి రెండవ వారంలో సూర్యాపేట జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభలో పాల్గొంటారని తెలిపారు.
Also Read: Nagoba Jatara: ఇక్కడ కోడళ్లకు ఆలయ ప్రవేశం నిషిద్దం.. ఇలవేల్పుల పరిచయం తర్వాతే..
ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. వైయస్సార్ కు ఉన్నంత అభిమానులు ఎవ్వరికీ లేరని, ఈ విషయం తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేస్తే, ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారాలు సాగిస్తున్నారన్నారు.