Kangana Ranaut:మహా కుంభమేళా సందర్భంగా మోనాలిసా(Monalisa) అనే యువతి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆమెకు లభించిన పాపులారిటీ ఎంతలా వుందంటే.. ఈమె వ్యాపారానికి కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా మహాకుంభమేళాలో పూసలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసాకు భక్తుల కారణంగా ఇబ్బంది ఏర్పడింది.దాంతో ఆమె తన స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా కంగనా రనౌత్ (Kangana Ranaut) మోనాలిసాను ఉద్దేశిస్తూ ఇన్స్టాలో తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఆమె లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఫోటోలు , వీడియోల కోసం మోనాలిసాను ఇబ్బంది పెట్టిన తీరు బాధ కలిగించింది అంటూ కంగనా తెలిపింది.
మోనాలిసా క్రేజ్ పై కంగనా కామెంట్స్..
ఇక ఇన్స్టాలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. “సహజ సౌందర్యంతో ఇంటర్నెట్లో సంచలనంగా మారిన మోనాలిసా తో ఫోటోలు దిగడానికి కొంతమంది ప్రవర్తించిన తీరు నన్ను బాధించింది. నేను వారిని ద్వేషించడం తప్ప ఇంకేం చేయగలను. ఇండస్ట్రీలో ఆమె రంగులో ఉండే హీరోయిన్లు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే వారందరినీ మీరు ఇలానే అభిమానిస్తున్నారా? ముఖ్యంగా కాజోల్ , దీపికా పదుకొనే వంటి నటీమణులపై చూపిన ప్రేమాభిమానాలే కొత్త హీరోయిన్లపై కూడా చూపిస్తున్నారా ? మోనాలిసాను గుర్తించినట్లుగానే కొత్తవారిని ఎందుకు గుర్తించడం లేదు?” అంటూ కంగనా తన ఇన్స్టా స్టోరీలో రాసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ సినిమాలు..
కంగనా రనౌత్ సినిమాలు విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.వాస్తవానికి ఈ సినిమాను తెరపైకి తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అంతేకాదు పలు విమర్శలు కూడా వినిపించాయి. కానీ ఎట్టకేలకు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మాధవన్ (Madhavan) తో కలిసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వీరిద్దరి కాంబినేషన్లో ‘తను వెడ్స్ మను3’ అనే సినిమా కూడా రూపొందుతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఎవరీ మోనాలిసా..?
మహా కుంభమేళ ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఇందౌర్ కి చెందిన మోనాలిసా పూసలమ్ముకోవడానికి కుంభమేళాకు వెళ్ళింది. ఇక తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసుకుంటున్న ఈమె అందాన్ని చూసి ముగ్ధుడైన ఒక వ్యక్తి ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో క్షణాల్లో ఆ ఫోటో కాస్త వైరల్ అయిపోయింది. ఇక అక్కడ ఉన్న వారు కూడా ఆమెతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఇక అలా సెల్ఫీల కోసం ఇబ్బంది పెట్టడంతో మోనాలిసా అక్కడి నుంచి తన స్వస్థలానికి వెళ్ళిపోయింది. మొత్తానికి అయితే మహా కుంభమేళాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది మోనాలిసా.