BigTV English

Haiti Gang Violence : హైతీలో గ్యాంగ్ హింస.. యూఎస్ మిషనరీ జంట సహా.. మరో వ్యక్తి హత్య

Haiti Gang Violence : హైతీలో గ్యాంగ్ హింస.. యూఎస్ మిషనరీ జంట సహా.. మరో వ్యక్తి హత్య

Haiti Gang Violence : యూఎస్ మిషనరీ జంట.. వారితో పనిచేసే ఒక హైతియన్ వ్యక్తిని హైతీ రాజధానిలో ముఠా సభ్యులు కాల్చి చంపారు. ఓ చర్చిలో నిర్వహించిన కార్యకలాపాల్లో పాల్గొని.. అక్కడి నుంచి బయటకు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.


గురువారం సాయంత్రం ఉత్తర పోర్ట్ ఓ ప్రిన్స్ లోని లిజోన్ కమ్యూనిటీలో ఈ దాడి జరిగినట్లు హైతీ పోలీసులు తెలిపారు. పోర్ట్ ఓ ప్రిన్స్ లో 80 శాతం హింసాత్మక దాడులు జరిగినట్లు వెల్లడించారు. అలాగే కెన్యాలోనూ హైతీ దాడులు జరుగుతున్నాయి. ఈ హింసను అణచి వేసే లక్ష్యంతో యూఎన్ మద్దతుతో కూడిన విస్తరణలో భాగంగా కెన్యా నుంచి పోలీస్ బలగాల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

చనిపోయిన జంట.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అని, వారి పేర్లు డేవీ(23), నటాలీ లాయిడ్(21) అని తెలిపారు. మూడో వ్యక్తిని జూడ్ మోంటిస్ గా గుర్తించారు. యువ జంట హత్య పై వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వారి మరణవార్త వినడంతో తన గుండె ముక్కలైందని నటాలీ లాయిడ్ తండ్రి ఫేస్ బుక్ లో రాశారు. తన కూతురు, అల్లుడు పూర్తికాల మిషనరీలని చాలా మందికి తెలుసని, హైతీ ముఠా సభ్యులు వారిపై దాడులు చేసి చంపేశారని చెప్పారు.


దాడి జరిగిన రాత్రి.. ముఠా సభ్యులను తీసుకువెళుతున్న మూడు వాహనాలు లాయిడ్స్, మోంటిస్ వీధి దాటుతుండగా ఆపి, తుపాకీ బారెల్‌తో తన సోదరుడి తలపై కొట్టినట్లు డేవీ సోదరి చెప్పింది. అతన్ని బలవంతంగా మేడపైకి ఎక్కించి, వారి వస్తువులను దొంగిలించి, కట్టేసి వదిలేశారు. ప్రజలు డేవి లాయిడ్‌ను విప్పడంలో సహాయం చేస్తుండగా, సాయుధ ముష్కరుల మరో గుంపు కనిపించింది. వారు కాల్పులు జరిపి చంపేశారని ఆమె పేర్కొంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×