Ashok Galla: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అశోక్ గల్లా (Ashok Galla). గల్లా జయదేవ్ కొడుకుగా రెండేళ్ల క్రితం ‘హీరో’ అనే సినిమాతో పరిచయమయ్యారు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘దేవకీ నందన వాసుదేవ'(Devaki Nandana Vasudeva). నవంబర్ 22వ తేదీన థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడు – కంసుడి మధ్య జరిగే కథను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకవైపు రొమాంటిక్ లవ్ స్టోరీ తో పాటు డివోషనల్ అంశాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది.
నమ్రత అత్త వల్లే నేను హీరో అయ్యా..
ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశోక్ గల్లా తాను హీరోగా మారడానికి గల కారణాన్ని వెల్లడించారు. అశోక్ గల్లా మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? అసలు ఏం చేయకూడదు..? అనే సలహాలు అన్నీ కూడా నాకు నమ్రత (Namrata) అత్త ఇచ్చారు. అత్తయ్య నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. ముఖ్యంగా నేను హీరోగా వద్దామనుకునే ముందు బాగా జుట్టు పెంచి, పోర్ట్ ఫోలియో (ఆడిషన్ ఫోటోలు) లో కూడా తీయించుకుందాం అనుకున్నాను. అందుకోసం సింపుల్ గా చెన్నై వెళ్లి ఫోటోలు తీసుకుందామనుకున్నాను. కానీ అత్త ముంబై వెళ్లి.. హెయిర్ స్టైల్ చేయించుకొని, ప్రాపర్ అఫీషియల్ పోర్ట్ ఫోలియో చేయించమని సలహా ఇచ్చింది.
నమ్రతపై అశోక్ గల్లా ప్రశంసలు..
అందుకు సపోర్ట్ కూడా చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే నమ్రత అత్త వల్లే నేను హీరో అయ్యాను. నమ్రత అత్త ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా నాకు కథలు ఎంపిక విషయంలో నమ్రత అత్త ఎంతో సహాయపడుతుంది”. అంటూ నమ్రత తనకు సపోర్ట్ చేసిన విషయం గురించి తెలిపారు అశోక గల్లా. ఒక రకంగా చెప్పాలి అంటే.. తాను ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కారణం మహేష్ బాబు (Mahesh Babu) భార్య నమ్రత అంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు.
నమ్రత కెరియర్..
నమ్రత విషయానికి వస్తే.. 1993లో మిస్ ఇండియాగా టైటిల్ గెలుచుకున్న ఈమె.. హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించింది. మహేష్ బాబు తో పాటు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వంటి హీరోల సినిమాలలో కూడా నటించింది. 2005లో మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితానికే కెరియర్ ను అంకితం చేసింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాబు గౌతం కృష్ణ , పాప సితార. ఇద్దరూ కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే హిందీలో చాలా చిత్రాలలో నటించిన ఈమె కన్నడ, మలయాళం సినిమాలలో కూడా నటించింది. ఇక ఇప్పుడు భర్తకు సంబంధించిన సినిమాలు, వ్యాపారాలు ఇలా అన్ని విషయాలలో సపోర్టుగా నిలుస్తూ. మహేష్ బాబుకు అండగా నిలుస్తోంది. మహేష్ బాబు ఇటు కెరియర్ పరంగా సక్సెస్ అందుకున్నారు అంటే దాని వెనుక నమ్రత ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు నమ్రత తన కుటుంబ సభ్యులైన అశోక గల్లా కెరియర్ కి కూడా సహాయపడుతూ ఆయనను హీరోగా మార్చేసింది.