Director Siva about Devi Sri Prasad: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఒకప్పుడు దేవిశ్రీ సంగీతం ఒక సినిమాను పీక్ లో నిలబెట్టేది. దేవి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఎంతమంది స్టార్ హీరోస్ సినిమాలుకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి దేవిశ్రీ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అప్పట్లో ఎక్కడ విన్నా కూడా జల్సా పాటలు వినిపించాయి. ఆ పాటలతో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు దేవి. శంకర్ దాదా ఎంబిబిఎస్, వెంకీ, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో సినిమాల్లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కీలకపాత్రను పోషించింది. ఇక రీసెంట్ టైమ్స్ లో దేవి శ్రీ ప్రసాద్ హవా కొంతమేరకు తగ్గిందని అనుకునే తరుణంలో పుష్పా సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.
దేవి శ్రీ ప్రసాద్ ఎంత మంది దర్శకులతో పనిచేసిన కూడా సుకుమార్ ఇచ్చిన సంగీత మాత్రం బెస్ట్ ఉంటుంది. ఇప్పటివరకు సుకుమార్ కూడా దేవి శ్రీ ప్రసాద్ తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేయలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత సంక్రాంతి కానుకగా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ కోసం గోవాలో కొన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ను ఉపయోగించాడు. ఈ విషయాన్ని స్వయంగా దేవి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ప్రస్తుతం దేవి సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా కంగువ. ఈ సినిమా కోసం ఆఫ్రికా నుంచి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు శివ. ట్రైబల్ ఫీల్ రావడం కోసం ఆ రేంజ్ లో సినిమాకి ఎఫర్ట్స్ పెట్టాడు దేవి.
Also Read : Spirit Don Lee : ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంటిరా బాబు, డాన్ లీ కి వీడియో ఎడిట్స్ చేస్తున్నారు
ఇక కంగువ సినిమా విషయానికి వస్తే ఇది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. ఈ సినిమా విడుదలకు కొద్దిపాటి థియేటర్ల సమస్య కూడా ఉంది. ఈ సినిమా మీద మంచి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. దాదాపు ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని తమిళ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం ఒక ఇంటర్వ్యూలో 2000 కోట్లు వసూలు చేస్తుంది అంటూ తెలిపారు. ఈ సినిమా మీద మంచి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది.