Ashwini Dutt..ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ (Ashwini Dutt) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) మొదలుకొని, నేడు ప్రభాస్ వరకు ఇలా ఎంతోమంది హీరోల చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రం ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ .700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాతో చిట్ చాట్ నిర్వహించిన అశ్వినీ దత్ 24 ఏళ్లుగా తీరని కోరికతో ఉన్నానంటూ వెల్లడించారు.
బడా నిర్మాణ సంస్థగా పేరుపొందిన వైజయంతి మూవీస్..
అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అశ్విని దత్ ఎంతో కృషి చేశారు కూడా.. ఎన్నో ఫ్లాప్ లు వచ్చినా ఎంతో పట్టుదలతో సినిమాలు చేస్తూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. అప్పట్లో వైజయంతి బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఆయన పని అయిపోయిందని , వైజయంతి బ్యానర్స్ ఎత్తేయాల్సిందే అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే అనూహ్యంగా కలిపి సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఫ్యూచర్లో వైజయంతి బ్యానర్ లో పెద్ద హీరోల సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వైజయంతి బ్యానర్ ను ఆయన నడపడం లేదు. ఆయన వారసులు ప్రియాంక దత్ ,స్వప్న దత్ కొనసాగిస్తున్నారు.
24 ఏళ్లుగా ఆ కోరిక నెరవేరలేదు..
ప్రభాస్ కెరియర్ లో బాహుబలి తర్వాత కల్కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అమితాబ్ పాత్ర అంత డామినేట్ చేసింది. కొంతమంది ఈ సినిమాలో హీరో ప్రభాస్ కాదని అమితాబ్ బచ్చన్ అంటూ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు..ఇక ఇటీవల ఒక చిట్ చాట్ లో తన కోరిక బయట పెట్టేశారు అశ్వినీ దత్. డైరెక్టర్ రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో నేను కలిసి పని చేశాను. అప్పుడే రాజమౌళి సినిమా అద్భుతంగా తీశాడు. ఆ తర్వాత నుంచి ఆయనతో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. కానీ సినిమా చేద్దామంటే అసలు కుదరడం లేదు. ఇప్పటికీ ఆయనతో సినిమా చేయాలనే కోరిక తీరనేలేదు ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విడుదల అయ్యి 24 ఏళ్ళు అవుతోంది. అయినా సరే రాజమౌళితో సినిమా చేయాలనే కోరిక నెరవేరడం లేదు. ఇప్పటికైనా నెరవేరుతుందో లేదో తెలియదు అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు తో ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రాబోతోంది.