Turkish Influencer sucide: తనను తానే విహనం చేసుకున్న తుర్కియేకు చెందిన ఓ ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకుంది. 26 ఏళకల కుబ్రా ఐకుట్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ గతేడాది తనను తానే వివాహం చేసుకుని ఫేమస్ అయింది. ఈ తరుణంటో తాజాగా ఓ లగ్జరీ అపార్ట్మెంట్ లో నుంచి ఐదో అంతస్తులో నుంచి కిందపడి చనిపోయింది.
గతేడాది తనకు తానే తగిన తోడు అని నిర్ధారించుకుని వరుడు లేకుండానే పెళ్లి చేసుకుంది. ఈమెకు సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా ఇన్ స్టాగ్రాంలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం చూపును తనవైపు తిప్పుకుంది. ఇంత అందమైన యువతి తనను తాను పెళ్లి చేసుకోవడం ఏంటనే చర్చలు కూడా మొదలయ్యాయి. తెల్లటి గౌను వేసుకుని ఎంతో అందంగా రెడీ అయిన కుబ్రా స్వీయ వివాహం చేసుకోవడం నెటిజన్లను బాధించింది. పూల బొకె పట్టుకుని కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
కుబ్రా ఆత్మహత్యకు గంట మునుపు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాను రోజురోజుకు కిలో బరువు తగ్గుతున్నట్లు తెలిపింది. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను గురించి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంది. చివరి వీడియోలో తన అపార్ట్మెంట్ క్లీన్ చేసినట్లు పోస్ట్ చేసింది. అయితే ఆమె ఆత్మహత్యకు సరైన కారణాలు మాత్రం తెలియకపోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎంత ప్రయత్నించినా కూడా నేను బరువు పెరగట్లేదు. ప్రతి రోజూ ఒక కిలో చొప్పున బరువు తగ్గిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా నేను బరువు పెరగాలి’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అయితే ఓ సూసైడ్ నోట్ పోలీసులకు దొరికినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. ఇక కుబ్రా మరణం సోషల్ మీడియాలో నెటిజన్లను బాధిస్తుంది. తన మరణం పట్ల అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కుబ్రా అంత్యక్రియలను తన స్వగ్రామంలో ఏర్పాటు చేసినట్లు సమాచారం.
View this post on Instagram