Nukaraju – Asiya: బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి కమెడియన్స్ పరిచయమయ్యారు. అలాంటి వారిలో నూకరాజు(Nukaraju) ఒకరు. బుల్లితెర కమెడియన్ గా ఎన్నో షోలలో సందడి చేస్తున్న నూకరాజు మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటీవల ఫోక్ సాంగ్స్ చేస్తూ కూడా ట్రెండ్ అవుతున్నారు. ఇటీవల నూకరాజు చేసిన తాటి బెల్లం అనే పాట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో నూకరాజు ఆసియా(Asiya) ఇద్దరు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో వీరి నటనపై కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా నూకరాజు ఆసియా ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిద్దరూ ఎన్నో అంశాల గురించి కూడా మాట్లాడారు.
ఎక్స్ పోజింగ్ కు తావులేదు…
ఇకపోతే ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే. అది వస్త్రధారణ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా మార్చుకుంటూ ఉండాలి కానీ ఆసియా మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎలాగైతే ఉన్నారో ఇప్పటివరకు ఒకే రకమైన వస్త్ర ధారణలో కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ కు తావు లేకుండా ఎంతో నిండుదనంతో కనిపిస్తారు. ఇక యాంకర్ నుంచి కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. తాటి బెల్లం అనే పాటలో ఈమె చీర కట్టుకొని చాలా హుందాగా కనిపించారు అలాగే బయట కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పు లేదు అంటూ ప్రశ్నించారు.
నా దుస్తులు.. నా ఇష్టం
ఈ ప్రశ్నకు నూకరాజు ఆసియా ఇద్దరు సమాధానం చెబుతూ.. నేను కూడా బీటెక్ వచ్చిన తర్వాత అందరిలాగే జీన్స్ డ్రెస్సులు వేసుకునే దాన్ని. అయితే నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలని మా అమ్మ చెబుతూ ఉన్న నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ నూకరాజుతో పరిచయం ఏర్పడిన తర్వాత నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి నూకరాజు ఒక రోజు నాతో మాట్లాడారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల అబ్బాయిల దృష్టి కూడా వేరే విధంగా ఉంటుందని నాకు అర్థం అయ్యేలాగా చెప్పారు. ఇక ఆ టైంలో నేను నా డ్రెస్సింగ్ స్టైల్(Dressing Style) నా ఇష్టం నువ్వు చెప్తే నేను వేసుకోవాలా అని ఎదురు సమాధానం చెప్పాను.
ఆసియా దొరకడం నీ అదృష్టం…
ఒకసారి తను ఎందుకలా చెప్పారనే విషయంపై నేను కూడా ఆలోచించానని, డ్రెస్సింగ్ విషయంలో నూకరాజు మా అమ్మ చెప్పింది నిజమే కదా అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే తను చెప్పిన విధంగానే తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నానని ఆసియా తెలిపారు. ఇక ఈ విషయం గురించి నూకరాజు మాట్లాడుతూ దాదాపు 6 సంవత్సరాలుగా ఆసియా తన డ్రెస్సింగ్ స్టైల్ ఏమాత్రం మార్చలేదు. ఈ విషయం గురించి కూడా ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఈ కాలంలో కూడా ఇలాగ ఉండే అమ్మాయిలు ఉంటారా? ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం అంటూ కామెంట్లు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని నూకరాజు తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతోమంది లేడీ కమెడియన్స్ కొనసాగుతున్నారు వారందరూ కూడా ప్రస్తుత కాలానికి అనుగుణంగా వస్త్రధారణ వేస్తున్నప్పటికీ ఆసియా మాత్రం ఎంతో నిండుగా బట్టలు వేసుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమని చెప్పాలి.
Also Read: Kamal Hassan: స్టార్ హీరోయిన్ తో హోటల్ గదిలో.. భార్యకు అడ్డంగా దొరికిపోయిన కమల్ హాసన్