BigTV English

Hit 3 Movie: ఇండస్ట్రీలో మరో విషాదం.. నాని మూవీ షూటింగ్ సెట్లో అపశృతి..!

Hit 3 Movie: ఇండస్ట్రీలో మరో విషాదం.. నాని మూవీ షూటింగ్ సెట్లో అపశృతి..!

Hit 3 Movie.. సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో కొంతమంది హఠాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. అలా ఇప్పుడు నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’ సినిమా షూటింగ్ సెట్ లో అపశృతి చోటుచేసుకుంది. నాని హీరోగా ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh kolanu) దర్శకత్వం వహిస్తున్న హిట్ 3 తెలుగు సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విశ్వక్ సేన్(Vishwak Sen)తో హిట్, అడివి శేష్ (తో హిట్ 2 చిత్రాలను తెరకెక్కించగా ఇప్పుడు మూడో భాగాన్ని నానితో తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమా బృందంలో యువ సినిమాటోగ్రాఫర్ కే.ఆర్. కృష్ణ (30) కూడా ఉన్నారు.


ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్లారు. అక్కడ శ్రీనగర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అక్కడే ఉన్న హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. సినిమా ఆటోగ్రాఫర్ గా , ఉమెన్ ఇన్ కలెక్టివ్ (WCC) సభ్యురాలైన కె ఆర్ కృష్ణ ఇలా సడన్గా మరణించడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అసలు ఈమెకు ఈ ఇన్ఫెక్షన్ ఎలా అయ్యింది ?ఈ సమస్య ఈమెకు ముందుగానే తెలియదా? ఒకవేళ తెలిసి నిర్లక్ష్యం చేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఇక కే.ఆర్ కృష్ణ విషయానికి వస్తే.. ఈమె ఎర్నాకులంకు చెందిన కోదంబ్రం రాజన్, గిరిజ దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి కోదంబ్రం రాజన్ కి పెరుంబవూరు, కురుపంపాడిలో గిన్నిస్ స్టూడియోలు ఉన్నాయి. ఇకపోతే ఈ హిట్ 3 తెలుగు సిరీస్ కి మలయాళ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ డిఓపిగా పనిచేస్తున్నారు. ఇక ఆయన దగ్గర అసోసియేట్ గా ఈమె పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్లలో షెడ్యూల్స్ తర్వాత జమ్మూకాశ్మీర్లో షూటింగ్ కోసమని చిత్ర బృందం అక్కడికి వెళ్ళింది. అయితే ఆమె అక్కడ తీవ్ర అస్వస్థకు గురయ్యారు.. జ్వరం కారణంగా కృష్ణ ఈనెల 23వ తేదీన కాశ్మీర్లోని ఒక ఆసుపత్రిలో చేరగా.. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే కాస్త కోలుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారట.


మరోవైపు ఆమెకు అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆమె సోదరుడు ఉన్ని కూడా శ్రీనగర్ కు చేరుకున్నట్లు సమాచారం.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన ఆమెను వార్డుకు తరలించే క్రమంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంత యంగ్ వయసులోనే ఆమె మరణం అభిమానులను సినీ సెలబ్రిటీలను కలచివేస్తోంది. ఇక ఈమె ఎన్నో మలయాళం చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. 20 ఏళ్ల వయసులోనే సినిమాటోగ్రఫీ చదివిన కృష్ణ వినీత్ శ్రీనివాసన్ నటించిన మనోహరం అనే సినిమాకి మొదటిసారి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×