మూవీ : మార్కో (తెలుగు డబ్)
విడుదల తేదీ : 31 డిసెంబర్ 2024
డైరెక్టర్ : హనీఫ్ అదేని
నిర్మాత : షరీఫ్ మహమ్మద్
నిర్మాణ సంస్థ : క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రన్ టైం : 145 నిమిషాలు
బడ్జెట్ : 30 కోట్లు
Marco Telugu Dub Movie Rating : 2.25/5
Marco Telugu Dub Movie Review and Rating : ‘జనతా గ్యారేజ్’ ‘భాగమతి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’. డిసెంబర్ 20 న మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దీంతో ఈరోజు డిసెంబర్ 31న తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించే విధంగా ఉందా? అనే విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
జార్జ్ (సిద్ధిఖీ) బంగారం వ్యాపారానికి సిండికేటర్. అతని చిన్న తమ్ముడు అయిన విక్టర్(ఇషాన్ షౌకత్) కి కంటి చూపు కనిపించదు. ఈ క్రమంలో ఒక రోజు విక్టర్ తన స్నేహితుడితో బయటకి వెళ్తే.. అక్కడ కొంతమంది వచ్చి విక్టర్ స్నేహితుడిని చంపేస్తారు. విక్టర్ హంతకుడిని చూడకపోయినా పోలీసులకి కొన్ని క్లూస్ చెబుతాడు. తర్వాత స్నేహితుడు అంత్యక్రియలు జరుగుతున్న ప్లేస్ కి ఆ హంతకుడు వస్తాడు. అతడిని పసిగట్టిన విక్టర్.. బయటకు వచ్చి అతని ప్రియురాలికి ఫోన్ చేసి వెంటనే కలవాలి అని చెబుతాడు. అయితే ఆ హంతకుడు.. విక్టర్ ని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని స్టెప్ బ్రదర్ అయిన మార్కో(ఉన్ని ముకుందన్) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత విక్టర్ ని చంపిన హంతకుడిని మార్కో ఎలా కనిపెట్టాడు? అతన్ని హతమార్చి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? లేదా? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు హనీఫ్ అదేని.. తీసుకున్నది కొత్త పాయింట్ ఏమీ కాదు. ‘గాడ్ ఫాదర్’ థీమ్ తో మొదలుపెట్టి.. తర్వాత ‘లూసిఫర్’ టర్న్ తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లోనే ఆ రెండు సినిమాల స్ఫూర్తి ఉందని ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి రెండు మర్డర్ల తర్వాత విలన్ ను హీరో ఎలా కనిపెడతాడు? అనే ఆసక్తితో కథనం నడుస్తుంది. కానీ ఇంటర్వెల్ కి విలన్ ఎవరో హీరోకి తెలిసిపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్ టార్గెటెడ్ ఆడియన్స్ నచ్చే అవకాశం ఉంది. అక్కడ వయొలెన్స్ ఉంటుంది.. అలాగే ‘పుష్ప 2’ లాస్ట్ ఫైట్ ను గుర్తుచేస్తుంది. ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డు వేశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టింగ్ గానే కథనం సాగుతుంది. హీరో ఫ్యామిలీని వాళ్ళ ఇంట్లోనే విలన్ గ్యాంగ్ అటాక్ చేసే టైం వరకు సినిమా బాగానే సాగుతుంది. కానీ హీరో కళ్ళముందే అతని ఫ్యామిలీని విలన్ గ్యాంగ్ చాలా దారుణంగా హతమారుస్తుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తాయి. దీనికి ‘యానిమల్’ సినిమాని దర్శకుడు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. బాలీవుడ్ వాళ్ళ కంటే ముందే ‘యానిమల్ పార్క్’ ను తీయాలనే అత్యుత్సాహం ఈ మలయాళ దర్శకుడు హనీఫ్ లో కనిపించింది. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. ఉన్ని ముకుందన్ లుక్ స్టైలిష్ గా ఉంది. యాక్షన్ సీన్స్ కోసం అతను చాలా కష్టపడినట్టు ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. ‘రంగబలి’ ఫేమ్ యుక్తి తరేజా నటనకి పెద్ద ఆస్కారం ఉన్న పాత్ర కాదు. సిద్దిఖీ నటన ఆకట్టుకుంటుంది. కబీర్ సింగ్ విలనిజం శృతి మించిన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా నటీనటులు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
యాక్షన్ బ్లాక్స్
ఫస్ట్ హాఫ్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
మితిమీరిన వయొలెన్స్
క్లైమాక్స్
మొత్తంగా… ‘గాడ్ ఫాదర్’ ‘లూసిఫర్’ సినిమాలకి ‘యానిమల్(పార్క్)’ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ ‘మార్కో’ అలా ఉంటుంది. ఇంత వయొలెన్స్ ను అక్కడి ప్రేక్షకులు ఎలా చూడగలుగుతున్నారో తెలీదు కానీ.. మన తెలుగు ప్రేక్షకులు అయితే చూసి తట్టుకోవడం కష్టం.
Marco Telugu Dub Movie Rating : 2.25/5