Rewind 2024 : టాలీవుడ్ కి ఎన్నో అద్భుతమైన మెమొరీస్ ను ఇచ్చింది 2024. పలువురు స్టార్లు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలన్నీ డీసెంట్ హిట్ గా నిలిచాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్ లుగా నిలిచి బాక్స్ ఆఫీసును షేక్ చేశాయి. ఈ ఏడాది వచ్చిన దేవర, కల్కి 2898 ఏడీ, పుష్ప 2 సినిమాలు తెలుగు సినిమాల కీర్తిని మరింతగా పెంచాయి. కానీ ఇదే 2024లో భారీ డిజాస్టర్లను తమ ఖాతాలో వేసుకుని డీలా పడ్డారు కొంతమంది యంగ్ హీరోలు.
వెంకటేష్ (Venkatesh)
మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న విక్టరీ వెంకటేష్ కు ఈ ఏడాది మొదట్లోనే బ్యాడ్ న్యూస్ ను వినాల్సి వచ్చింది. 2024 జనవరిలో ఆయన నటించిన ‘సైంధవ్’ మూవీ రిలీజై, వెంకటేష్ కెరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
వరుణ్ తేజ్ (Varun Tej)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ హిట్ అనే మాట విని ఏళ్లు గడుస్తోంది. 2024లో ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకటి ‘ఆపరేషన్ వాలెంటైన్’, రెండవది ‘మట్కా’. ఈ రెండు సినిమాలు చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. కనీసం చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేదు. నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చాయి. పైగా ఈ రెండు సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. మిగతా భాషల సంగతిని పక్కన పెడితే, తెలుగు ఆడియన్సే వరుణ్ తేజ్ ను పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో వరుణ్ తేజ్ కు ఈ ఇయర్ చేదు అనుభవమే ఎదురైంది.
రవితేజ (Raviteja)
ఇక 2024 లో రెండు సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర బొక్క బోర్లా పడ్డ హీరోలలో రవితేజ కూడా ఉన్నారు. ఈ ఏడాది ఆయన ‘ఈగిల్’, ‘మిస్టర్ బచ్చన్’ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. దురదృష్టవశాత్తు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ రెండు సినిమాలను నిర్మించారు. మరోవైపు రవితేజ ఇటీవల చేసిన సినిమాలన్నీ పరాజయం పాలైనప్పటికీ, ఆయన భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
విశ్వక్ సేన్ (Vishwak Sen)
యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆయన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ వంటి సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు. అయితే ఈ మూడు సినిమాలు కూడా డిజాస్టర్లే. మరి వచ్చే ఏడాది అయినా ఈ హీరోకి కలిసి వస్తుందేమో చూడాలి.
రామ్ పోతినేని (Ram Pothineni)
2024లో ప్రేక్షకుల నుంచి తీవ్ర తిరస్కరణను ఎదుర్కొన్న హీరో రామ్. ‘డబుల్ ఇస్మార్ట్’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు రామ్. కానీ ఈ సినిమా ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాధ్ డైరక్షన్ పై తీవ్ర విమర్శలు విన్పించాయి. నెక్స్ట్ ఇయర్ ఈ హీరోలు అందరూ అప్డేటెడ్ కంటెంట్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.