Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) జ్యోతిష్యాల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో చెప్పనక్కర్లేదు. ఒక సెలబ్రిటీకి ఎంత పాపులారిటీ అయితే ఉంటుందో అంత పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే అలాంటి వేణు స్వామిని చాలామంది యూట్యూబర్ లు ఇంటర్వ్యూలు చేస్తూ ఎన్నో షాకింగ్ విషయాలను బయట పెడుతూ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. అయితే వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యంలో కొన్ని నిజమవ్వడంతో ఆయనని చాలామంది నమ్ముతున్నారు కూడా.ఇక తర్వాత కాలంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం పూర్తిగా విఫలమవ్వడంతో వేణు స్వామి పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఏర్పడింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రిజల్ట్ వచ్చిన సమయంలో వేణు స్వామి నేను ఇక ఏ ఇంటర్వ్యూలో పాల్గొని ఎవరి జాతకాలు చెప్పనంటూ క్షమాపణలు చెప్పినట్టుగా ఓ వీడియో పోస్ట్ చేశారు. కానీ మళ్ళీ నాగచైతన్య (Naga Chaitanya) ఎంగేజ్మెంట్ అయిన సమయంలో తన జ్యోతిష్యాన్ని మళ్ళీ మొదలుపెట్టారు.
నా వద్దకు కాల్ గర్ల్స్ వస్తారు – వేణు స్వామి..
అయితే అలాంటి వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దగ్గరికి కాల్ గర్ల్స్ వస్తారంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు.. వేణు స్వామి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. తలవంచను. రేవంత్ రెడ్డి (Revanth Reddy), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), అల్లు అర్జున్ (Allu Arjun) ల కంటే నేనేమీ తోపుకాదు. వాళ్లే జైళ్లకు వెళ్లి వచ్చారు. వాళ్ళ కంటే నేనేమీ ఎక్కువ కాదు.నేను ఓ కోన్ కిస్కా గొట్టం గాడిని. నా మీద కేసులు పెట్టి జైల్లో తోస్తాను అంటే అస్సలు భయపడను. ఈ కలియుగంలో జైల్లో పెట్టడం తప్ప చేసేదేమీ లేదు.అందుకే నాకస్సలు భయం ఉండదు.ఇక నా దగ్గరికి సెలబ్రెటీలు మాత్రమే కాదు కాల్ గర్ల్స్, రౌడీషీటర్లు,మాఫియా డాన్స్ ప్రతి ఒక్కరూ వస్తారు.గురూజీ క్యా చాహియే అంటూ ఎంతో ప్రేమగా అడుగుతారు. కానీ నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే మీడియా వాళ్ళు.. అలాంటి మీడియా వాళ్లే ఇప్పుడు నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.
అందుకే ఈ బిజినెస్ మొదలు పెట్టా – వేణు స్వామి
వారు తమ ఛానల్స్ ద్వారా జ్యోతిష్యాలు చెప్పడం, పంచాంగాలు చెప్పడం చేయించారు.కానీ ప్రస్తుతం వారే నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.. నేను దేవుళ్లకు పొట్టేలు మాంసాన్ని నైవేద్యంగా పెడతాను. నాకు బార్ కూడా ఉంది.ఎందుకంటే నా జాతకంలో ఈ బిజినెస్ లోనే సక్సెస్ అవుతానని ఉంది.కాబట్టి అందుకే ఈ బిజినెస్ చేశాను అంటూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు వేణు స్వామి.
ALSO READ:Kuberaa: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన కుబేర.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?