OTT Movies : ప్రతి వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవి ఉంటే, మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవే ఉంటాయి. ఎలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలైనా సరే ఓటీటీలో మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకోవడంతో త్వరగా ఓటీటీ ప్లాట్ ఫామ్లలోకి వచ్చేస్తున్నాయి.. ఈ నెలలో థియేటర్లలోకి స్టార్ హీరోల సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పైనే ఉంది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అటు ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ లు నటించి న భైరవం విడుదల కానుండగా జాకీచాన్ కరాటే కిడ్, బాలీవుడ్ ప్రముఖ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ సీజన్2 వంటివి ప్రేక్షకుల ఎదుటకు రానున్నాయి. వీటితో పాటు మలయాళ నుంచి మూన్ వాక్, టొవినో థామస్ నరివెట్ట వంటి సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఓటీటీలోకి ఏ మూవీ రాబోతుందో ఒకసారి చూసేద్దాం పదండీ..
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు…
జియో హాట్ స్టార్..
మూన్‌వాక్ (మాల్, హాయ్, టెల్, టామ్, కాన్) జూలై 8
రిఫార్మ్డ్ (జియో హాట్ స్టార్),- జూలై 9
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 : సీజన్ 2 – జూలై 11
ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ సీజన్ 9- జూలై 11
బ్యూరీడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ సీజన్ 6 – జూలై 13
అమెజాన్ ప్రైమ్ వీడియో..
కరాటే కిడ్ – జూలై 8
ది పొనీషియన్ స్కీమ్ – జూలై 8
ది అన్ హౌలీ ట్రినిటీ – జూలై 8
వాచ్ ది స్కైస్ – జూలై 8
బల్లార్డ్ – జూలై 9
డ్రాప్ – జూలై 11
నోబు – జూలై 11
పేవ్మెంట్స్ (MUBI) – జూలై 11
సావరిన్ -జూలై 11
నెట్ ఫ్లిక్స్…
అండర్ ఏ డార్క్ సన్ -జూలై 9
జియామ్- జూలై 11
7 బియర్స్- జూలై1 1
బ్రిక్ – జూలై 11
ఏ బ్రదర్ అండ్ సెవెన్ సిబ్లింగ్స్ -జూలై 11
లయన్స్ గేట్ ప్లే..
మిస్టర్ రాణి- జూలై 11
ఫోర్ ఇయర్స్ లేటర్- జూలై 11
సన్ నెక్స్ట్…
కలియుగం – జూలై 11
కర్కి -జూలై 11
మనోరమ మాక్స్..
మిస్టర్ అండ్ మిస్ బ్యాచిలర్ – జూలై 11
ఈవారం బోలెడు సినిమాలు ఓటీటీలో రాబోతున్నాయి.. ఇప్పటివరకైతే ఈ సినిమాలు డేట్ ని లాక్ చేసుకున్నాయి. మధ్యలో కొన్ని సినిమాలు వచ్చి ఓటిటి డేట్ ని బ్లాక్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేయండి.. ఈ నెలలో మొదటివారం థియేటర్లోకి వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆఖరి వారంలో రాబోతున్న స్టార్ హీరోల సినిమాల కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు..