Venu Swamy:ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి(Venuswamy ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈయన చేసే కామెంట్స్ వల్ల సెలబ్రిటీలు ఏమో కానీ వారి అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో హర్ట్ అవుతున్నారని చెప్పవచ్చు. అదే స్థాయిలో వేణు స్వామి పై కూడా విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రాజకీయాలపై కూడా జ్యోతిష్యం చెప్పినా.. ఆ జ్యోతిష్యం కాస్త బొక్క బోర్ల పడడంతో ఈయనపై చాలామంది విమర్శలు గుప్పించారు. దాంతో హర్ట్ అయిన వేణు స్వామి ఇకపై జ్యోతిష్యం చెప్పను అంటూ కామెంట్ చేసి మళ్లీ నాగచైతన్య (Naga Chaitanya), శోభిత (Shobhita) పెళ్లి చేసుకుంటే విడిపోతారు అంటూ కామెంట్లు చేసి మళ్లీ అభిమానుల చేత చివాట్లు పడ్డారు.
ఒక హీరో , హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటారు – వేణు స్వామి
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ స్కాం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే .ఈ విషయంపై పలువురి సినీ పండితులు ఒక ప్రధాన మీడియా నిర్వహించిన డిబేట్లో పాల్గొనగా.. ఈ సందర్భంగా వేణు స్వామికి సంబంధించిన ఒక సంచలన ఆడియో లీకై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఆ వీడియో ప్రకారం.. వేణు స్వామి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా.. ముగ్గురు స్టార్స్ చనిపోతారు అని చెప్పి హాట్ బాంబు పేల్చారు. ఒక హీరోయిన్, ఒక హీరో ఆత్మహత్య చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది అని చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ముఖ్యంగా వారి పేర్లు కూడా ఈయన ప్రస్తావించారు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha ), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రభాస్ (Prabhas) గురించి ఆందోళనకరమైన జ్యోతిష్యం చెప్పి అభిమానులను కలవరపాటుకు గురిచేశారు.
వేణు స్వామి సంచలన ఆడియో వైరల్..
సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ లలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారని, తన లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారని, ఈ విషయాలు మునుమందు తెలుస్తాయని, ఇంకా మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ కూడా ఆయన తెలిపారు. దీనికి తోడు ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.. ప్రభాస్ కు శరీరమంతా గాయాలే ఉన్నాయి .కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదు.ఇటు ‘రాజాసాబ్’ చిత్రం కూడా అందుకే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని, ఇవన్నీ ముందు జరగబోతున్నాయి. అన్ని అయిన తర్వాతే మాట్లాడుకుందాం అంటూ ఆయన చెప్పిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా సమంత , విజయ్ దేవరకొండ , ప్రభాస్ లాంటి స్టార్ సెలబ్రిటీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది విన్న నెటిజన్స్ ఇలాంటి వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లు బయటకు రావడంతో వీరు ముగ్గురూ స్పందిస్తారా లేక పట్టీ పట్టనట్టు ఉండిపోతారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ముగ్గురు సెలబ్రిటీల అభిమానులు మాత్రం వేణు స్వామి పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత చనిపోతారు…
సంచలనం అవుతున్న వేణుస్వామి ఆడియో..#Prabhas #VijayDeverakonda #SamanthaRuthPrabhu #VenuSwami pic.twitter.com/Tll7b5kZF4
— PolyTricks (@PolyTricks_in) March 21, 2025
Shalini Pandey: డైరెక్ట్ రూమ్ లోకి వచ్చేస్తారు… క్యాస్టింగ్ కౌచ్ పై అర్జున్ రెడ్డి బ్యూటీ ఫైర్..!