Security Alert : సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నిబంధనలు పాటించని కారణంగా.. అత్యంత ప్రమాదకరమైన 331 యాప్ లను గూగుల్ తన ఫ్లేస్టోర్ నుంచి తీసేసింది. అయితే.. ఇవ్వన్నీ 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదు చేయడమే ఆందోళన కలిగిస్తోంది. ఈ యాప్‌లు వినియోగదారులను అనవసర, ప్రమాదకర ప్రకటనలతో మోసగిస్తున్నట్లు గూగుల్ సెక్యురిటీ చెకప్ లో గుర్తించింది. మరి ఈ యాప్ లలో మీరు ఏమైనా డౌన్ లోడ్ చేసుకున్నారేమో.. ఓసారి చెక్ చేసుకోండి.
గూగుల్ తొలగించిన యాప్ లు మోసపూరిత ప్రకటనలు, ఫిషింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు కనుక్కున్నారు. వేపర్ ఆపరేషన్ అని పిలిచే.. ఈ విధానంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ సిస్టమ్స్ ప్రమాదంలో పడ్డాయని తెలిపింది. ఈ యాప్ లు ఆండ్రాయిడ్ భద్రతల్ని దాటవేసి, హానికరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేలా వినియోగదారులను మోసగించింది. వ్యక్తిగత డేటాను దొంగిలించాయి. అలాగే.. క్రెడిట్ కార్డ్ వివరాలను కూడా సేకరించాయి.
వేపర్ ఆపరేషన్ అంటే ఏమిటి?
భద్రతా నిపుణులు ఈ వేపర్ ఆపరేషన్ అనే విధానాన్ని 2024 నుంచి యాక్టివ్‌గా ఉన్నట్లు కనుక్కున్నారు. ఇది మొదట్లో మోసపూరిత ప్రకటనల కార్యక్రమంగా మొదలైంది. ఈ యాప్‌లు ప్రతిరోజూ దాదాపు 200 మిలియన్ల నకిలీ ప్రకటన అభ్యర్థనలను సృష్టించాయి. హెల్త్ ట్రాకర్లు, QR స్కానర్లు, బ్యాటరీ ఆప్టిమైజర్‌ల వంటి ఉపయోగకరమైన సాధనాలను విక్రయిస్తున్నట్లుగా చూపిస్తూ.. యూజర్లను తప్పుదారి పట్టిస్తూ, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. ఈ యాప్ ల్లోని తీవ్రస్థాయి ముప్పుల్ని తర్వాత కనుక్కున్నారు. వీటిలో కొన్ని ఆక్వాట్రాకర్, క్లిక్‌సేవ్ డౌన్‌లోడర్, స్కాన్ హాక్ – ప్రతి ఒక్కటి 1 మిలియన్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లతో విస్తృతంగా యూజర్లకు చేరువయ్యాయి. ఈ యాప్ లన్నీ ఎక్కువగా బ్రెజిల్, యుఎస్, మెక్సికో, టర్కీ, దక్షిణ కొరియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి.
గూగుల్ సెక్యూరిటీని ఎలా దాటాయి?
గూగుల్ కఠినమైన ప్లే స్టోర్ విధానాలు ఉన్నప్పటికీ, వేపర్ ఆపరేషన్ ఆండ్రాయిడ్ భద్రతా తనిఖీలను విజయవంతంగా దాటవేసింది. గుర్తించకుండా ఉండటానికి హానికరమైన యాప్‌లు ప్రారంభంలో చట్టబద్ధమైన ప్రకటనలు ఇస్తున్నట్లుగా గుర్తించారు. కమాండ్-అండ్-కంట్రోల్ (C2) సర్వర్‌ల నుంచి అప్ డేట్ ద్వారా హానికరమైన కోడ్ ను తర్వాత ప్రవేశపెడుతున్నట్లుగా గుర్తించారు.
ఇన్‌స్టాల్ చేసిన తర్వాత..
* ఒక్కసారి ఇలాంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే.. ఆ తర్వాత AndroidManifest.xml ఫైల్ ద్వారా వారి లాంచర్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. దాంతో.. హోమ్ స్క్రీన్‌ల నుంచి యాప్ కనిపించకుండా పోతుంది. దీంతో.. ఈ యాప్ కనిపించదు, అన్‌ఇన్‌స్టాల్ చేయడమూ కష్టమైపోతుంది.
* గూగుల్ వాయిస్ వంటి వాటికి అనుసంధానించేందుకు సెట్టింగ్‌లలో యాప్ పేర్లు మార్చేస్తూ, వినియోగదారులను మోసగిస్తున్నట్లుగా గుర్తించారు.
* యూజర్ అనుమతులు లేకుండానే.. పూర్తి స్క్రీన్ ప్రకటనలు వస్తాయి, బ్యాక్ కు వెళ్లే బటన్ పనిచేయదు.. దాంతో తప్పనిసరిగా ఆ యాడ్ చూడాల్సి ఉంటుంది. స్క్రీన్ పై ఎక్కడ టచ్ చేసినా.. ఆ ఐటమ్ కొనేందుకు పేమెంట్ చేసే దగ్గరకు వెలుతుంది.
* ఫేస్‌బుక్, యూట్యూబ్, చెల్లింపు పోర్టల్‌ల కోసం నకిలీ లాగిన్ పేజీలను చూపించడం ద్వారా ఫిషింగ్ దాడులు చేస్తున్నాయి.
* కొన్ని యాప్‌లు వినియోగదారుడి పరికరం మాల్వేర్ బారిన పడిందని తప్పుగా క్లెయిమ్ చేసి, అదనపు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. ఇది భారత్ లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న సాధారణ స్కామ్.
హానికరమైన యాప్‌ల నుంచి సురక్షితంగా ఎలా ఉండాలి
ఈ హానికరమైన యాప్‌లను Google తొలగించినప్పటికీ, వినియోగదారులు తమ పరికరాలు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం.. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
* అనవసరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం మానుకోండి. విశ్వసనీయ డెవలపర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు ఎప్పుడూ సమీక్షలు, రేటింగ్‌లు, అనుమతులను చెక్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
* హైడ్ చేసిన మాల్వేర్ కోసం చెకింగ్ తప్పనిసరి. ఇందుకోసం – సెట్టింగ్‌లు > యాప్‌లు > అన్ని యాప్‌లను చూడండి. వాటిని.. మీ యాప్ స్టోర్ లో కనిపిస్తున్న యాప్ లతో పోల్చి చూడండి. హోమ్ స్క్రీన్ నుంచి ఒక యాప్ తప్పిపోయినప్పటికీ సెట్టింగ్‌లలో ఇన్‌స్టాల్ చేసే ఉంటే.. అది మాల్వేర్ కావచ్చు.
* గూగుల్ ప్లే ప్రొటెక్ట్- ప్లే స్టోర్ సెట్టింగ్‌లలో Google Play Protectని ఆన్ చేయండి. ఇది ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను హానికరంగా మారకుండా నిరోధించేందుకు రెగ్యులర్ గా స్కాన్ చేస్తుంది. సురక్షితం కాని యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
* భద్రతా లోపాలను సరిచేయడానికి మీ Android, OS యాప్‌లను నిత్యం అప్ డేట్ చేస్తుండాలి.
* మీ ఫోన్, సిస్టమ్ ఇన్‌ఫెక్ట్ అయిందని చెప్పుకునే అనుమానాస్పద పాప్-అప్‌లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయడం మానేయాలి.
Also Read : Smartphone Offer: పవర్‌ఫుల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి స్మార్ట్‌ఫోన్..లిమిటెడ్ టైం ఆఫర్..