RGV:కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరొకసారి అర్థరాత్రి చేసిన పోస్టు సంచలనంగా మారింది. సాధారణంగా ఏదైనా సరే ఖచ్చితంగా మాట్లాడే వర్మ.. అప్పుడప్పుడు కాస్త దిగజారి మాట్లాడతారనే మాటలు అటు అభిమానుల నుంచి కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓట్కా పెగ్గేసి అర్ధరాత్రి ట్వీట్ వేసినట్టుగా ఆ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది అంటూ ట్విట్టర్ యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన హిందీలో నటిస్తున్న తొలి మూవీ ‘వార్ -2’ నుంచి అఫీషియల్ టీజర్ విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలాగే ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ (Hrithik Roshan) హవా ఎక్కువగా కనిపించింది. ఆయన బాడీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ లో హృతిక్ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. పైగా ఎన్టీఆర్ లుక్ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
వార్ -2 టీజర్ పై వర్మ ట్వీట్.. దుమ్మెత్తిపోస్తున్న జనాలు..
ఇది పక్కన పెడితే ఈ టీజర్ లో చాలామంది కియారా బికినీ పైనే కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా వర్మ కూడా ఇలాంటి పనే చేశారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వార్ -2 టీజర్ మీద ఆయన స్పందించారు. ఎన్టీఆర్, హృతిక్ క్లోజప్ షాట్స్ పెట్టి.. “ఆ కళ్ళే చెబుతున్నాయని” ఎన్టీఆర్ ను ట్రోల్ చేసిన పోస్ట్ మీద వర్మ స్పందించారు.” అవును” అంటూ ఆయన కామెంట్ పెట్టాడు. అయితే అక్కడ వర్మ ఉద్దేశం ఏంటో కూడా సరిగ్గా అర్థం కావడం లేదు. కానీ నెటిజన్స్ అనుకుంటున్న విషయానికి వస్తే.. వార్ 2 టీజర్ మొత్తంలో తనను అట్రాక్ట్ చేసింది ఒక కియారా అద్వానీ (Kiara advani) మాత్రమే అన్నట్లుగా ట్వీట్ వేశాడు వర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే వార్ -2 టీజర్ లో కియారా కనిపించిన ఆ ఒక్క సెకండ్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఆమె బికినీ ఫోజులు, బ్యాక్ నుంచి కియారాను చూపిస్తూ హైలెట్ చేయడంతో ఇప్పుడు ఆ కియారా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వర్మ కూడా అవే స్టిల్స్ ను దృష్టిలో పెట్టుకొని.. సమాజం కోసం ఎన్టీఆర్, హృతిక్ ఫైట్ చేయకుండా.. ఎవరికి కియారా బ్యాక్ దక్కుతుందో అని ఫైట్ చేస్తే వార్ -2 మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుందంటూ.. తన స్థాయిని దిగజార్చుకునేలా వర్మ ట్వీట్ చేసినట్లు అనిపిస్తోంది అంటూ.. వర్మ వేసిన ట్వీట్ మీద జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు. మద్యం మత్తులో ఇలాంటి ఆలోచనలు తప్ప ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి అంటూ విమర్శిస్తున్నారు. అయితే వర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
వార్ -2 టీజర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..
ఇకపోతే వార్ -2 టీజర్ మాత్రం ఒకరకంగా అందర్నీ ఆకట్టుకున్నా.. అందులో ఎన్టీఆర్ వాయిస్ తప్ప ఆయన లుక్ ఎక్కడ కనిపించలేదు.. దీనికి తోడు ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ను ఓ రేంజ్ లో చూపిస్తారని అనుకున్న ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ మాత్రమే మిగిలింది. అందుకే బాలీవుడ్ వాళ్ళు మళ్ళీ మోసం చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
— Ram Gopal Varma (@RGVzoomin) May 20, 2025