Intinti Ramayanam Today Episode May 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆరాధ్యని చూడటానికి దొంగలాగా అర్ధరాత్రి వస్తాడు. కానీ ఆరాధ్యను చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అవనికి దొరుకుతాడు.. మీ కూతురిని మీరు చూడటానికి ఇలా దొంగలాగ రావాల్సిన అవసరం లేదు. మీ కూతురు మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు అని అవని అంటుంది. ఇక తర్వాత ఉదయం అవని ఆఫీస్ కెళ్ళి ఫ్లవర్స్ ని సర్దుతూ ఉంటుంది.. అప్పుడు అక్కడికి క్లైంట్స్ వస్తారు. ఈమె మీ ఆవిడే కదా అని అడుగుతారు. నేను వాళ్లతో పసుపుతో మాట్లాడాలని అక్షయ అంటే వాళ్ళు మాత్రం మీ ఆవిడే కదా అని ఉండనివ్వండి అని అంటారు. ప్రాజెక్ట్ వచ్చిందని అక్షయ్ సంతోషంగా ఉంటాడు. ఆరాధ్యను అక్షయ్ నుంచి ఎవరో తీసుకెళ్లిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆరాధ్యను అక్షయ్ తీసుకెళ్లిపోయాడని ఇంటికి వచ్చి కంగారుపడుతూ చెప్తుంది. రాజేంద్రప్రసాద్ నువ్వెందుకు వాడితో పంపించావు. నేను తీసుకెళ్లారు మావయ్య మళ్ళీ తీసుకొస్తారని అనుకున్నాను కానీ తీసుకురాలేదు అని అవని అని బాధపడుతుంది. ఇంటికి తీసుకెళ్లాడేమో లే అమ్మ వస్తాడులే అనేసి అంటాడు.. ఇంటికి కూడా నేను వెళ్లాను అక్కడ కూడా లేదు. ఆయన ఇంట్లో లేడు అని టెన్షన్ పడుతుంది. ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియట్లేదు మామయ్య అని ఆరాధ్య అంటుంది.
అప్పుడే అక్కడకు అక్షయ్ వస్తాడు.. ఆరాధ్య ఎక్కడ కనిపించలేదు అని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే ఆరాధ్యను నువ్వు తీసుకెళ్లి ఇంటికి వచ్చి అడుగుతున్నావ్ ఏంట్రా అని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. నేను తీసుకెళ్లి అన్న కానీ ఐస్ క్రీమ్ కొనిపిద్దామని తీసుకెళ్లాను.. ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకొచ్చేలాగా కార్లో ఉన్న ఆరాధ్య కనిపించలేదు ఇక్కడికి ఏమైనా అవని తీసుకొచ్చిందేమో అని వెతుక్కుంటూ వచ్చాను అని అక్షయ్ అంటాడు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా నీ మీద కిడ్నాప్ కేసు పెడతాను గుర్తుపెట్టుకో అని రాజేంద్రప్రసాద్ వార్నింగ్ ఇస్తాడు. నేను చెప్పేది నిజమే నాన్న అని అక్షయ్ మొత్తుకొని చెప్తాడు.
మరి ఎక్కడికెళ్ళింది.. ఆరాధ్య కనిపించకుండా ఉండాలి నీకు తర్వాత చెప్తాను అంటాడు. ఇక అవని అక్షయ్ వెళ్లి ఆరాధన వెతకాలని వెళ్తారు. రాజేంద్రప్రసాద్ కూడా ఆరాధ్య నేను వెతుకుతానని వెళ్తాడు. పార్వతి దిగులుగా కూర్చొని ఉంటుంది. ఏమైంది పార్వతి అవని అన్న మాటలు పట్టుకుని ఫీల్ అవుతున్నావా అని భానుమతి అంటుంది. అప్పుడే పల్లవి ఎక్కడికొచ్చి అవని అక్క కంటే మేము చిన్నవాళ్ళం. నన్ను శ్రీయా ను ఎన్ని మాటలు అయినా పడతాం.. కానీ అత్తయ్య వయసులో పెద్దదని కూడా చూడకుండా వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అదే బాధపడుతుంది అని పుల్లలు పెడుతుంది..
ఇక అక్షయ్ కి పార్వతి ఫోన్ చేసి ఆరాధ్యను తీసుకెళ్లావ్ అంట కదా మంచి పని చేశావు నా కొడుకు అనిపించుకున్నావని మెచ్చుకుంటుంది. ఇక ఆరాధ్యను ఇంటికి తీసుకురా ఏదైతే అది అయింది ఆ తర్వాత చూద్దామని పార్వతి అంటుంది. కానీ అక్షయ్ మాత్రం ఆరాధ్య నా దగ్గర లేదమ్మా. నేను అవని దగ్గర నుంచి ఆరాధ్యను తీసుకెళ్లిన మాట నిజమే.. ఐస్ క్రీమ్ కొనిద్దామని తీసుకెళ్తే బయటికి వచ్చి చూసేలాగా ఆరాధ్య కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందో అర్థం కావట్లేదు నేను అవని ఇద్దరం కలిసి ఆరాధ్య నువ్వు వెతుకుతున్నామని అంటాడు.
అది విన్న పల్లవి మీ మట్టి బుర్రలకు ఇది ఎందుకు అర్థం కావట్లేదు అని అరుస్తుంది. అవనిని ఆరాధ్యను దాచి పెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నట్లు నాటకం ఆడుతుందని పల్లవి భానుమతి పై సీరియస్ అవుతుంది. ఇక పార్వతీ రాజేంద్రప్రసాద్, అవనీ, అక్షయ్ లు వెతకడానికి వెళ్తారు. ఒకచోట కార్ ఆపి ఆరాధ్య ఎక్కడికెళ్ళిందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ మారువేషంలో వచ్చి వాళ్ళని ఆరోగ్య అక్కడుందని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..