BigTV English

Atlee: కాపీ ట్రోల్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన అట్లీ.. అదే స్పూర్తి అంటూ!

Atlee: కాపీ ట్రోల్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన అట్లీ.. అదే స్పూర్తి అంటూ!

Atlee: రాజా – రాణి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దర్శకుడు అట్లీ. (Atlee)మొదటి సినిమా ద్వారానే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన అనంతరం వరుస హిట్ సినిమాల ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నయనతార ప్రధాన పాత్రలలో నటించిన జవాన్(Jawan) అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు.


ఇక జవాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు రావడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలను కూడా అందుకుంటున్నారు. తాజాగా అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో కలిసి అసలు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. చాలా సైలెంట్ గా అల్లు అర్జున్ అట్లీ ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రెగ్యులర్ షూటింగ్ పనులు మొదలుపెట్టారు. ఇలా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని చెప్పాలి.

డాక్టరేట్ అందుకున్న అట్లీ..


ఇకపోతే అట్లీ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ఏ ఒక్క సినిమా కూడా నిర్మాతలకు నష్టాలను తీసుకురాలేదని చెప్పాలి. ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈయన అపజయ మెరుగని దర్శకుడుగా గుర్తింపు పొందారు. ఇక ఇండస్ట్రీకి అద్భుతమైన సేవలు అందించినందుకుగాను డైరెక్టర్ అట్లీ ఇటీవల చెన్నైలోనే సత్యభామ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇలా డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈయనకు సోషల్ మీడియాలో తన సినిమాలపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డైరెక్టర్ అట్లీ చేసే సినిమాలన్నీ కూడా కాపీ సినిమాలంటూ ఈయనపై విమర్శలు చేస్తున్నారు.

నా జీవితంలో జరిగిన సంఘటనలు..

అట్లీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలను చూస్తున్నప్పుడు ఈ తరహా సినిమాని ఎక్కడో చూసామనే భావన అందరిలోనూ ఉంటుందని, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చే సోషల్ మెసేజ్ యాక్షన్ డ్రామా తరహాలో అట్లీ సినిమాలు ఉంటాయని ఈయన సినిమాలపై ఎంతోమంది విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ఈ విమర్శలపై అట్లీ స్పందిస్తూ తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. నా సినిమాలను చూస్తూ ఏవైతే కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారో అవన్నీ కూడా తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే సినిమాలు చేస్తున్నానని తెలిపారు. తన సినిమాల్లో కొన్ని పాత్రలు కూడా ఇతరులను స్పూర్తిగా తీసుకొని చేసినవే తప్ప కాపీ కాదంటూ ఈయన తనదైన శైలిలోనే ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని ఈయన తెలియజేశారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే నటించబోతున్న విషయాన్ని ఇటీవల అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×