Ashwin – Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ 2025 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. గ్రాండ్ విక్టరీ కొట్టి.. ఛాంపియన్ గా అవతరించింది. అంతేకాదు.. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలవడం గమనార్హం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. 2025 టోర్నమెంట్ లో అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా.. విఫలమై ఇంటిదారి పట్టింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.
Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?
ప్రక్షాళన దిశగా చెన్నై సూపర్ కింగ్స్
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ప్రక్షాళన చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏజ్ బారైనా క్రికెటర్లు అందరినీ పక్కకు తప్పించి… బ్రేవిస్ లాంటి యంగ్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలని అనుకుంటున్నారట. ఎప్పటిలాగే మహేంద్ర సింగ్ ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవాలని.. ఒకవేళ అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే… కోచ్ గా బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతేకాదు… చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చాలామంది ప్లేయర్లను బయటికి పంపించాలని కూడా అనుకుంటున్నారట.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి అశ్విన్ అవుట్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం కారణంగా… కొన్ని మ్యాచ్ల్లో అతని ఆడించేందుకు మహేంద్ర సింగ్ ధోని కూడా డేరింగ్ చేయలేదు. అంత దారుణమైన ప్రదర్శన కనబరిచారు రవిచంద్రన్. ఏర్కోరి రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్ ను కొనుగోలు చేస్తే.. తమకు దరిద్రంలా మారిపోయాడని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్ ను తప్పించాలని డిసైడ్ అయ్యారట. అతని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి పంపించి.. సంజు సాంసంగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
మార్పునకు సమయమైంది అంటూ సంజు హింట్
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా కొన్ని మ్యాచ్లకు మాత్రమే సంజు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జట్టును వీడి బయటకు రావాలని అనుకుంటున్నారట. దీంతో అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ కు పంపించి సంజూను తీసుకురావాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బ్రేవిస్ ఉండకూడదని అశ్విన్ కుట్రలు చేస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అతని తొలగించి తనను అలాగే ఉంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
🚨 ASHWIN will not retire with CSK?? pic.twitter.com/Wz7wpKhXo7
— Abhinav MSDian™ (@Abhinav_hariom) June 15, 2025