ప్రపంచం నలుమూలల ఏం జరుగుతోంది అనే విషయాన్ని క్షణాల్లో ప్రజలకు చేరవేసే ఏకైక సాధనం మీడియా. ముఖ్యంగా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు మీడియా మిత్రులు. అలాంటి వారిపై దాడి ఎంత క్రూరత్వానికి దారి తీస్తుందో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన మోహన్ బాబు(Mohanbabu) జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమై సినీ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేయాలని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మోహన్ బాబు పై కేస్ ఫైల్..
అందులో భాగంగానే తాజాగా మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు పోలీసులు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన పై పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు పై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాచకొండ పోలీసులు నిన్న ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు 10:30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. ఇకపోతే మరొకవైపు మనోజ్ తో జరిగిన సంఘర్షణలో మోహన్ బాబు కి బీపీ డౌన్ అవ్వడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు.. వెంటనే ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న మోహన్ బాబు ఈరోజు రాచకొండ పోలీసులు అందించిన నోటీసుల మేరకు విచారణకి వస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అసలు చిక్కంతా అక్కడే..
తండ్రీ కొడుకుల మధ్య ఆస్తుల వివాదాలు ఇంటి వరకే పరిమితం అయితే బాగుంటుంది. కానీ మంచు కొడుకులు ఇద్దరు కూడా ఏకంగా పదుల సంఖ్యలో బౌన్సర్లను దింపడంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మోహన్ బాబు విద్యానికేతన్ , మోహన్ బాబు యూనివర్సిటీ విద్యాసంస్థలలో ఇల్లీగల్ జరుగుతోందనే నేపథ్యంలో మనోజ్ తన తండ్రిని ప్రశ్నించారట. ఆ సమయంలో గొడవ జరిగినట్లు వార్తలు వినిపించాయి.. ఇకపోతే అక్కడ జరిగిన సంఘర్షణలో ఆ ఇంటి పనిమనిషి కూడా ఊహించని కామెంట్స్ చేసింది. దీంతో మంచు కుటుంబంలో గొడవలు మంచు మనోజ్ పెళ్లి నుంచే మొదలయ్యాయనే వార్తలు వ్యక్తమవుతున్నాయి.
కొడుకుపై కోపం.. జర్నలిస్ట్ పై దాడి..
ఇక ఇదిలా ఉండగా మరొకవైపు తనకు అన్యాయం జరుగుతోందని అధికారులను కలిసిన మనోజ్, మౌనిక దంపతులు తిరిగి తమ కూతురిని తీసుకోవడానికి జల్పల్లిలో వున్న ఇంటికి వస్తే, వారిని లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ. దీంతో గేట్లు ధ్వంసం చేసుకుని మరీ మనోజ్ దంపతులు లోపలికి వెళ్లారు. ఆ సమయంలో మీడియా మిత్రులు పరిస్థితి తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళగా, కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు వారి దగ్గర ఉన్న టీవీ మైక్ తీసుకొని జర్నలిస్టుపై దాడి చేశారు. ఇకపోతే గాయపడ్డ జర్నలిస్టులు మోహన్ బాబు పై ఫిర్యాదు ఇచ్చారు. మోహన్ బాబు వల్ల తమకు ప్రాణహాని ఉందని, ఆయనను అరెస్టు చేయాలి అని జర్నలిస్టుల కోరగా.. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నేడు ఆయనపై కేసు ఫైల్ చేశారు.