Cartoon Network: యానిమేషన్ అనేది ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లోకి మారిపోయింది. కానీ అసలైన యానిమేషన్ అంటే ఏంటో 90స్ కిడ్స్‌ను అడిగితే చెప్తారు. అప్పట్లో అందరికీ యానిమేషన్స్ అంటే కార్టూన్ నెట్‌వర్క్. ఎన్నో ఫన్నీ కార్టూన్స్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసిన ఘనత కార్టూన్ నెట్‌వర్క్‌కే దక్కుతుంది. అలాంటి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న క్లాసిక్ ఛానెల్ మూతబడిపోతుందని ఎన్నో రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కార్టూన్ నెట్‌వర్క్ క్లోజ్ అవ్వడం ఖాయమని ఇంగ్లీష్ మీడియా కూడా ప్రచారం చేస్తోంది. ఇంతలోనే కార్టూన్ నెట్‌వర్క్ సరికొత్త రూపంలో తన ఫ్యాన్స్‌ను అలరించడానికి వచ్చేస్తోంది. కార్టూన్ నెట్‌వర్క్ రివైండ్ రూపంలో.
అమెజాన్ ప్రైమ్‌లో రీవైండ్
ఓటీటీ అనేవి గత కొన్నేళ్లలో చాలా పాపులర్ అయ్యాయి. అందుకే భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన సినిమాలు సైతం ఓటీటీలో విడుదల చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. అదే విధంగా కనుమరుగమయిపోయిన కార్టూన్ నెట్‌వర్క్‌ను మళ్లీ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి ఓటీటీనే సరైన మార్గమని వార్నర్ బ్రోస్ సంస్థ భావించింది. అందుకే ఇండియాలో అమెజాన్ ప్రైమ్‌తో చేతులు కలిపి కార్టూన్ నెట్‌వర్క్ రీవైండ్‌ను సబ్‌స్క్రైబర్స్ ముందుకు తీసుకురానుంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో కార్టూన్ నెట్‌వర్క్‌లోని ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ అన్నీ స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దీనికోసం అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఒక యాడ్ ఆన్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు.
Also Read: షూటింగ్ స్పాట్ లో ప్రమాదం… అక్షయ్ కుమార్ కు గాయాలు
యాడ్ ఆన్ సబ్‌స్క్రిప్షన్
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో త్వరలోనే కార్టూన్ నెట్‌వర్క్ (Cartoon Network) క్లాసిక్ ప్రోగ్రామ్స్ అయిన ‘ది పవర్‌పఫ్ గర్ల్స్’, ‘టామ్ అండ్ జెర్రీ’, ‘స్కూబీ డూ’, ‘జానీ బ్రావో’, ‘లూనీ ట్యూన్స్’, ‘డెక్స్‌టర్స్ ల్యాబోరేటరీ’, ‘సుమురాయ్ జాక్’, ‘ఎడ్ ఎడ్ ఎన్ ఎడ్డీ’తో పాటు మరెన్నో ప్రోగ్రామ్స్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిని చూడాలంటే మామూలు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోదు.. ముందుగా కార్టూన్ నెట్‌వెర్క్ ఇంట్రడక్టరీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దానికోసం ఏడాదికి రూ.199 కట్టాలి. ఆ సబ్‌స్క్రిప్షన్ పూర్తయితే ఆ తర్వాత ఏడాది నుండి రూ.249 ఛార్జీలు వర్తిస్తాయి. అలాంటి కార్టూన్ నెట్‌వర్క్‌లోని కొన్ని క్లాసిక్ కార్టూన్స్‌ను మళ్లీ ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పటి పిల్లలకు తెలిసేలా
అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పటికే మరెన్నో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా జతచేరాయి. అలాగే ఇప్పుడు కార్టూన్ నెట్‌వర్క్ రీవైండ్ కూడా యాడ్ అవ్వనుంది. ఇలా అమెజాన్ ప్రైమ్‌తో కలవడం సంతోషంగా ఉందని వార్నర్ బ్రోస్ సంస్థ ప్రకటించింది. ఒకప్పుడు కార్టూన్ నెట్‌వర్క్ అనేది పిల్లలను ఎంతగా అలరించిందో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈతరం పిల్లలకు కూడా కార్టూన్ నెట్‌వర్క్ గురించి తెలియాలని ఈ ప్రయత్నం మొదలుపెట్టామని ఈ సంస్థ తెలిపింది. 90స్ కిడ్స్ కూడా మళ్లీ తమకు నచ్చిన కార్టూన్స్‌ను చూసి అప్పటిరోజులను గుర్తుచేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వవచ్చని చెప్పుకొచ్చింది వార్నర్ బ్రోస్.