BigTV English

Bigg Boss Himaja : బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హిమజ.. ఏమన్నారంటే..?

Bigg Boss Himaja : బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హిమజ.. ఏమన్నారంటే..?

Bigg Boss Himaja : ఒకప్పుడు బుల్లితెర షోలలో పాటిస్పేట్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీ అందుకుంది. వాస్తవానికి బుల్లితెరపై ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ ద్వారా కెరియర్ ఆరంభించిన హిమజ, ఆ ఫేం తో బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇక్కడ షోలు చేస్తూ దర్శకుల కంట్లో పడ్డ ఈమె, వెండితెరపై అడుగు పెట్టింది. ఆ క్రమంలోనే స్పైడర్, వినయ విధేయ రామ, జంబలకడిపంబ, చిత్రలహరి, జిందగీ, స్పైడర్ వంటి తదితర చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


లవ్, బ్రేకప్ పై హిమజా కామెంట్స్..

సినిమాలలో వచ్చిన గుర్తింపు ద్వారా బిగ్ బాస్ సీజన్ 3 లోకి అడుగుపెట్టి, డేరింగ్ అండ్ డాషింగ్ గా, మంచి మాటతీరుతో మెప్పించిన ఈమె, ఫైర్ బ్రాండ్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాకపోయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది హిమజ. ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో చేస్తున్న ఈమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో భాగంగానే హిమజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రేమ, పెళ్లి గురించి ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. నేను కెరియర్ గురించే ఆలోచిస్తున్నాను. అలాగే నా జీవితంలో పెద్దగా లవ్ లెటర్స్ ప్రపోజల్స్ రాలేదు. కాంప్లిమెంట్ గా ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి” అని చెప్పింది.


నా హార్ట్ లో చాలామంది ఉన్నారు..

ఆ షో యాంకర్… మిమ్మల్ని ఎవరు లవ్ చేయలేదా? అని యాంకర్ ప్రశ్నించగా.. “ఎందుకు చేయరు? నా లైఫ్ లో కూడా ఎన్నో లవ్ స్టోరీలు ఉన్నాయి. నేను కూడా ఎంతోమందిని ఇష్టపడ్డాను. వారు కూడా నన్ను ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది. దానిని నేను బ్రేకప్ అని చెప్పి, లవ్ యొక్క వాల్యూ ని తీయలేను. కాబట్టి ఒకసారి లవ్ చేస్తే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అది సినిమాలలో నటించే క్యారెక్టర్ లాంటిది కదా” అంటూ సమాధానం తెలిపింది హిమజ. ఆ తరువాత “మీ లైఫ్ లో.. మీ హృదయంలో.. ఎవరైనా ఉన్నారా? ” అని ప్రశ్నించగా.. “నా హార్ట్ లో చాలా మంది ఉన్నారు. అయితే ఆ కొంతమంది మనసులో అలాగే ఉండిపోతారు. ముఖ్యంగా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇప్పటికీ అతడు నా మనసులో అలాగే ఉండిపోయాడు” అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది హిమజ.

ఎవరి స్వార్థం వారిది..

ఒకరి పేరైనా చెప్పగలరా అని అడగ్గా.. దానికి ఆమె మాట్లాడుతూ..” నేను కొంతమంది గురించి చెబితే కాపురాలు కూలిపోతాయి అని టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. నిజానికీ ఆ టైటిల్లోని మ్యాటర్ కి, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా నా ఫ్రెండ్.. వ్యూస్ కోసం అలా థంబ్ నెయిల్ పెట్టింది. వాస్తవానికి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే.. ఎవరినైనా లవ్ చేసావా ? అని ప్రశ్నించినప్పుడు, వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకుని ఉంటారు. నేను వాళ్ళ పేరు చెప్పి వారి కాపురాలు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అనే తీరులో అది ఉంది. కాకపోతే నోరు విప్పితే వాళ్ల కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి వ్యూస్ సంపాదించుకున్నారు. ఎవరి స్వార్థం వారిది” అంటూ హిమజ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిమజ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×