AVS:కమెడియన్ ఏవీఎస్ (AVS )అంటే ఇప్పటికీ కూడా పరిచయం ఉన్న నటుడే. ఈయన దాదాపు 500కు పైగా సినిమాల్లో తన కామెడీతో అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే అలాంటి ఏవీఎస్ మరణం ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చావు బ్రతుకుల నుండి బయటపడడం కోసం.. ఈయన కూతురు ఎంతో శ్రమించింది. అయినా కూడా ఫలితం దక్కలేదు. తండ్రి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి ఏవీఎస్ ని బ్రతికించుకున్నప్పటికీ ఆ ఆనందం కొద్దిరోజులే ఉంది అంటూ తాజాగా ఏవీఎస్ కూతురు ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మరణం గురించి చెప్పుకొని ఎమోషనల్ అయింది.
నటుడుగానే కాదు విలన్ గా కూడా మెప్పించిన ఏవీఎస్..
మరి ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏవీఎస్ కూతురు ఏం మాట్లాడింది. ఏవీఎస్ మరణానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రముఖ కమెడియన్ ఏవీఎస్ అప్పటి జనరేషన్ అయినటువంటి బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి ఎంతోమంది కామెడీ దిగ్గజాలతో పని చేశారు.ముఖ్యంగా 500కు పైగా సినిమాల్లో పనిచేసిన అనుభవం ఈయనది. అలాంటి ఏవీఎస్ గారు నటించిన శుభలగ్నం, మాయలోడు వంటి సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. ఇక ఈయన కేవలం కమెడియన్ గానే కాకుండా కామెడీ, విలన్ గా కూడా చేశారు.
ఏవీఎస్ మరణం పై కూతురు ఎమోషనల్ కామెంట్స్..
అయితే అలాంటి ఏవీఎస్ మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన కూతురు శాంతి మాట్లాడుతూ.. నాన్న చనిపోవడానికి తాగుడే కారణమని చాలామంది అన్నారు. కానీ మా నాన్న చనిపోవడానికి కారణం తాగుడు కాదు. ఆయన లివర్ చెడిపోయింది. అలాగే ఎప్పుడు సినిమా సినిమా అంటూ రాత్రింబవళ్లు సినిమాల కోసమే తన సమయం కేటాయించాడు. ఆరోగ్యం పట్టించుకోకుండా రాత్రింబవళ్లు సినిమాల కోసం కష్టపడడంతో ఆరోగ్యం దెబ్బ తిని, 57 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. మొదట ఆయన రక్తపు వాంతులు చేసుకున్నారు. అవి చూసి నేను ఎంతగానో భయపడిపోయాను. అలాగే లివర్ మార్పిడి చేయకపోతే బ్రతకరని డాక్టర్స్ చెప్పారు. అయితే నేను నా లివర్ ఇస్తానని ముందుకు వచ్చాను. కానీ నాన్న దానికి ఒప్పుకోలేదు. అలాగే నేను లావుగా ఉండడం కారణంగా నా లివర్ సెట్ అవ్వదు అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ తర్వాత నాన్న మెమోరీ పవర్ ని కూడా కోల్పోయారు. దాంతో మమ్మల్ని ఎవర్నీ గుర్తుపట్టలేదు. ఆ తర్వాత డాక్టర్లు నాన్నని ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు.మమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నారు. ఆరోజు ఇంటికి వెళ్ళాక మేము నైట్ నిద్ర కూడా పోకుండా దేవుడికి మా బాధను విన్నవించుకున్నాం.
దేవుడిని వేడుకున్న తెల్లవారుజామునే మమ్మల్ని ఆ దేవుడు కరుణించాడు. ఉదయాన్నే మా నాన్నకి మళ్ళీ జ్ఞాపకశక్తి వచ్చిందని చెప్పారు డాక్టర్స్. మా నాన్న ఫోన్ చేసి కూడా మాట్లాడారు.
ఆ సమస్య వచ్చినా పర్లేదనిపించింది..
అయితే 20 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే బ్రతకరు అని డాక్టర్స్ చెప్పడంతో.. నేను లివర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను. కానీ నాన్న దానికి ఒప్పుకోలేదు. నీకు ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కానీ నా భర్త నాన్నను ఒప్పించి, చివరికి 60% లివర్ ని మా నాన్నకి ఇచ్చేశాను. ఆ తర్వాత రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినా వినకుండా మళ్ళీ షూటింగ్స్ అంటూ సినిమాల మీదే పడ్డారు. దాంతో ఆపరేషన్ అయ్యాక ఆరు సంవత్సరాలకు ఆయన మరణించారు.ఆయన మరణించే సమయంలో కూడా నా చేతుల్లోనే ప్రాణం విడిచారు. నా చేతుల్లో రక్తం కక్కి దారుణంగా చనిపోయారు. ఆయన మరణం ఇప్పటికీ మమ్మల్ని కోలుకోకుండా చేసింది.
రూ.65 లక్షలు ఖర్చయ్యాయి..
గత ఏడాది నవంబర్లో మా అమ్మ కూడా చనిపోయింది. మా నాన్న ఆపరేషన్ కి దాదాపు రూ.65 లక్షలు ఖర్చు అయ్యాయి” అంటూ కమెడియన్ ఏవీఎస్ కూతురు శాంతి ఆ ఇంటర్వ్యూలో తండ్రి మరణం గురించి చెప్పుకొని ఎమోషనల్ అయింది. ఇక ఏవీఎస్ కూతురు, అల్లుడు కూడా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు.