BigTV English

Ayalaan: ‘అయలాన్’ సీక్వెల్‌.. ఆ ఒక్క దానికే రూ.50 కోట్ల ఖర్చు..!

Ayalaan: ‘అయలాన్’ సీక్వెల్‌.. ఆ ఒక్క దానికే రూ.50 కోట్ల ఖర్చు..!

Ayalaan: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఒక్క తెలుగు తప్ప మిగతా ప్రాంతాల్లో విడుదలై.. భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సీక్వెల్ ఖరారైంది. ఈ మేరకు కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ సంస్థలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.


ఇందులో భాగంగా ‘అయలాన్-2’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌కే దాదాపు రూ.50 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో ఆ బడ్జెట్ మరింత పెరిగే అవకాశముందని నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో వారు వెల్లడించలేదు. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించనుందని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల రిలీజైన ‘అయలాన్’ బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×