BigTV English

AP Cabinet: రూ. 85 వేల కోట్ల పెట్టుబడుల రాక.. ఆ పని చేస్తే ఇక చుక్కలే.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం

AP Cabinet: రూ. 85 వేల కోట్ల పెట్టుబడుల రాక.. ఆ పని చేస్తే ఇక చుక్కలే.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం

AP Cabinet Meeting: ఏపీకి పెట్టుబడుల జాతర మొదలైంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర మొదలైందని చెప్పవచ్చు. పెట్టుబడుల రాకతో యువతకు ఉపాధి కల్పన చేరువచేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.


ఏపీ కేబినెట్ సమావేశం ఈనెల 18వ తేదీన నిర్వహించాలని ముందుగా నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో 20వ తేదీకు వాయిదా వేశారు. తినే పద్యంలో బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు.

రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అరికట్టే చర్యలలో భాగంగా ప్రయోగించే పీడీ యాక్ట్ చట్టాన్ని సైతం మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు సైతం కేబినెట్ పచ్చి జెండా ఊపింది. దీనితో రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.


అంతేకాకుండా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం, లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, మత్తు పదార్థాలను వినియోగించే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర రాజధానిగా గుర్తించబడ్డ అమరావతిలో సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, స్పోర్ట్స్ పర్యాటక పాలసీలపై సైతం నిర్ణయం తీసుకుంది.

Also Read: YS Jagan – RGV: దర్శకుడు ఆర్జీవీకి జగన్ సపోర్ట్.. షాకిచ్చిన ప్రకాశం పోలీస్.. 25న విచారణకు రాకుంటే?

ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయడంతో పాటు, దేవాలయ కమిటీలలో ఇద్దరు సభ్యులకు తప్పనిసరిగా చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపగా, ఇప్పటినుండి ఆలయాల కమిటీ సభ్యులలో అధికారులతో పాటు స్థానిక భక్తులకు సైతం కమిటీలో చోటు దక్కనుంది. ఇలా ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కీలక అంశాలను ప్రస్తావించి ఆమోదించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×