Big TV Kissik Talks:నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి సమయాన్ని కేటాయించడం అత్యంత అరుదుగా మారిపోయింది.
పొట్ట నింపుకోవడానికి మాత్రమే తింటున్నారు కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా ఆలోచించలేకపోతున్నారు. అందుకే చిన్న వయసులోనే గుండెపోటు రావడం లేదా వయసు మించకుండానే పలు అనారోగ్యాలు సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీనికి తోడు 60 ఏళ్ళు నిండకనే తనువు చాలిస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు, సినీ సెలబ్రిటీలు మాత్రం ఏడు పదుల వయసు దాటినా సరే ఇంకా అంతే యంగ్ గా, ఎనర్జిటిక్ గా, స్మార్ట్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సీనియర్ సెలబ్రిటీలలో యంగ్గా కనిపించే వారిలో నాగార్జున (Nagarjuna) లాంటి హీరోలు ఎక్కువగా కనిపించిన.. ఎన్టీఆర్ (NTR), ఏఎన్ఆర్(ANR ) కాలంనాటి నటీనటులు ఇప్పటికీ కూడా అంతే యంగ్ గా, హుషారుగా కనిపిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో బాబు మోహన్ (Babu Mohan) కూడా ఒకరు. తాజాగా ఈయన ‘బిగ్ టీవీ’ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో (Kissik Talks show)లో పాల్గొని.. తాను 73 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా, హుషారుగా ఉండడానికి అసలు కారణం ఏంటో తెలిపారు.
ఆ అలవాట్లే ఇంత ఆరోగ్యంగా వుంచాయి – బాబు మోహన్
జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) హోస్ట్గా మారి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. వారి పర్సనల్ విషయాలను కూడా బయటకి తీస్తూ.. ఎన్నో తెలియని విషయాలను అందరికీ తెలియజేస్తోంది. అందులో భాగంగానే ఈ వారం కిస్సిక్ టాక్స్ షో కి ప్రముఖ దిగ్గజ లెజెండ్రీ నటులు, కమెడియన్ బాబు మోహన్ (Babu Mohan) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలోనే పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా వర్ష ప్రశ్నిస్తూ..”ఈ వయసులో కూడా మీరు ఇంత యంగ్ గా, ఎనర్జిటిక్ గా ఉండడానికి గల కారణం ఏమిటి?” అని ప్రశ్నించగా.. బాబు మోహన్ మాట్లాడుతూ.. “నేను యవ్వనంలో తీసుకున్న జాగ్రత్తలే ఇంత హుషారుగా ఉండడానికి కారణం. నాతో పాటు పెరిగిన వారు నా క్లాస్మేట్స్, నాతోటి నటీనటులు ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందులో కొంతమంది చనిపోయారు కూడా.. కానీ నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి చిన్నప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలే కారణం.. నేను రెండు, మూడు తరగతులలో స్కూల్ కి వెళ్లేటప్పుడు కూడా సుమారుగా రెండు ముద్దల వెన్న తిని స్కూల్ కి వెళ్లేవాడిని. మా కాలంలో టీ, కాఫీలు లాంటివి పెద్దగా ఉండేవి కావు. మజ్జిగ, పళ్ళు, ఆకుకూరలతోనే మేము రోజు గడిపే వాళ్ళం. ఇక నాలుగు ఐదు తరగతులకే నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసే వాడిని. ఆరోగ్యకరమైన జీవితం.. పైగా చక్కని వాతావరణం.. పొల్యూషన్ అసలే ఉండేది కాదు. అలాంటి వాతావరణంలో మేము పెరిగాం. కాబట్టి ఇప్పుడు ఇలా ఆరోగ్యంగా ఉన్నాము” అంటూ సమాధానం ఇచ్చారు బాబు మోహన్.
నేటి తరానికి ఇచ్చే సలహా..
ఇక నేటి తరానికి మీరిచ్చే సలహా ఏంటి ? అని ప్రశ్నించగా “ఆరోగ్యాన్ని ఇప్పటినుంచే జాగ్రత్తగా చూసుకుంటే, అది మనల్ని ఇంకొంతకాలం బ్రతికిస్తుంది” అంటూ సలహా ఇచ్చారు. ప్రస్తుతం బాబు మోహన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.