BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలును కాలర్ పట్టుకున్న శివ.. పార్వతికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బాలును కాలర్ పట్టుకున్న శివ.. పార్వతికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode May 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం మీనా దగ్గరికి వచ్చి ఒక కాఫీ ఇవ్వమని అడుగుతాడు. మీనా సత్యం కి కాఫీ ఇస్తుంది. అప్పుడే ఫోన్ రావడంతో మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మమ్మ గారు ఫోన్ చేశారని మాట్లాడుతుంది. సుశీల మీనా తో సరదాగా మాట్లాడుతుంది. ఇక్కడ నిన్ను మహారాణి లాగా కాపాడుకున్నాను.. అక్కడ బాగా పనులతో బిజీ అయిపోయావు కదా అని అంటే పూలకట్టు పెట్టాను కదా అమ్మమ్మ అక్కడ పని ఇంట్లో పని కాస్త బిజీగానే ఉన్నానని మీనా అంటుంది. మేమందరం బాగున్నాం కానీ మావయ్యకి చిన్న సమస్య అనబోతుంది. సత్యం చెప్పొద్దని సైగ చేయడంతో ఆగిపోతుంది. ఆ తర్వాత బాలు వచ్చి మందులు వేసుకున్నావా నాన్న ఇప్పుడు నీకు బాగానే ఉందా అని అడుగుతాడు. పూలగంప ఏంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అని బాలు ఫోన్ తీసుకుంటాడు.. శీల డార్లింగ్ బాగున్నావా మేమంతా చాలా బాగున్నాం అని అడుగుతుంది. మొత్తానికి మీనాని మళ్లీ పెళ్లి చేసుకున్నావు..ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావంటే మేము కూడా సంతోషంగా ఉన్నాను రా అని సుశీల అంటుంది. ఫోటోలు పంపిస్తే నేను ప్రేమ్ కట్టించుకుంటాను అంటుంది. అలాగేనే బాలు అంటాడు. ఫోటోషాప్ అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ శివ గురించి నిజం తెలిసి షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ప్రోమో విషయానికి వస్తే.. ఫోటోషాప్ అతనితో బాలు మంచిగా పెద్ద సైజు ఫోటోలు కావాలన్నా అని అడుగుతాడు. ఆ ఫోటోలను చూసినా అతను మీ అమ్మగారు ఇటీవల దొంగతనానికి గురయ్యారు కదా అనేసి అడుగుతాడు. అవునన్నా ఎవరో ఒక వెధవ మా అమ్మ దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడు అని బాలు అంటాడు. ఎవరో కాదు ఇదిగో ఇక్కడ చూడు ఒకసారి అని చూపిస్తాడు. ఆ విజువల్స్ లో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ ప్రభావతి బ్యాగు ని కొట్టేసి డబ్బులు తీసుకొని బ్యాగ్ ని అక్కడే పడేసి వెళ్లిపోతారు. అది చూసిన బాలు మొహానికి మాస్కులు వేసుకుని ఉన్నారు కదా అన్న కనిపెట్టలేకపోతున్నాం ఎవరో తెలిస్తే మాత్రం వాడికి ఉంటది అని అంటారు.

అవును బాలు ఆ వ్యక్తి ఇతనే ఇదిగో ఈ వీడియోలో చూడు మాస్క్ తీసేస్తాడు అని మరో వీడియోని చూపిస్తాడు. అది చూసిన బాలు శివ గుణాన్ని కన్ఫామ్ చేసుకొని కోపంతో రగిలిపోతాడు. సరే అన్నా మీరు ఫ్రేమ్ కట్టించండి నేను సాయంత్రం వచ్చి తీసుకుంటాను అని అంటాడు. ఇక రాజేషు కార్ దగ్గరికి వెళుతూ ఉంటే గుణ అక్కడికి వచ్చేస్తాడు. వడ్డీ కట్టమంటే ఏదేదో సాకులు చెప్తున్నావేంటిరా వడ్డీ కడతావా కారుని తీసుకుపోమంటావా అని అడుగుతాడు. గుణ రెండు రోజుల్లో ఇస్తాను వేరే అర్జెంటు పని ఉండి వాటికి వాడేసాను అని రాజేష్ ఎంత చెప్పినా కూడా గుణ వినడు. ఆ రెండు రోజులు కార్ తీసుకుపోతే నీకే తెలుస్తుంది అని అంటాడు.


కారు తీసుకోకపోతే నీ పెళ్ళాన్ని తీసుకొని పొమ్మంటావా రెండు రోజులు నాతో ఉంచుకొని తర్వాత పంపిస్తాను డబ్బులు నాకు ఇవ్వనక్కర్లేదు అన్నట్లు గుణ మాట్లాడుతాడు. దానికి కోపంగా ఫీల్ అయిన రాజేష్ గుణాన్ని కొడతాడు. మళ్లీ కొట్టబోతుంటే గుణ రాజేష్ ని కొడతాడు. మరో దెబ్బ రాజేష్ ని కొట్టపోతుంటే మధ్యలో బాలు వచ్చి ఆపుతాడు. గుణను కొడతాడు. డబ్బులు ఇస్తాను అన్నప్పుడు ఇస్తాడు ఎగ్గొట్టి పోడు కదా మరి ఎందుకు నువ్వు దారుణంగా మాట్లాడుతున్నావ్ నువ్వు మనిషివేగా నీకు కూడా తల్లి చెల్లి ఉన్నారుగా మీ చెల్లె లాంటివి అమ్మాయిని ఇలా అంటావా అని గుణపై బాలు రెచ్చిపోతాడు.

గుణ వెంట వచ్చిన శివ బాలు కాలర్ పట్టుకుని అరుస్తాడు. నా ఫ్రెండ్ ని కొడితే బావ అని కూడా చూడను కొడతానని శివ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. నా కాలరే పట్టుకుంటావు రా ఎంత ధైర్యం రా నీకు అని శివని బాలు కొడతాడు. శివకు దెబ్బ తగలడంతో కారుపై పడిపోతాడు. నువ్వు ఇంట్లో కాలేజీకి పోతున్నానని చెప్పి ఇలా మళ్లీ వీడు వెనకాల తిరుగుతున్నావా నీ అమ్మ చెల్లి ఎంత కష్టపడుతున్నారో కొంచమైనా ఆలోచించవా మనిషి లాగానే కొంచమైన బుద్ధుందా అని శివ కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ బాలు ఎంతగా ఆపాలని ప్రయత్నించినా కూడా బాలు ఆగడు. నీకు డబ్బులే కదా ఈరోజు సాయంత్రం కాలనీ నీకు డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్లి ఇక నుంచి అని చెప్పేసి గుణకి మార్నింగ్ ఇస్తాడు. అంతే అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో శివ గురించి పార్వతి ఇంట్లో బాలు నిజం చెప్పేస్తాడా? లేదా?అన్నది చూడాలి..

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×