BigTV English

Thandel Collections : నాగ చైతన్య మూవీ నయా రికార్డు.. 500 కోట్లు రాబడుతుందా..?

Thandel Collections : నాగ చైతన్య మూవీ నయా రికార్డు.. 500 కోట్లు రాబడుతుందా..?

Thandel Collections : యంగ్ హీరో అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య ( Naga Chaithanya) ఖాతాలో హిట్ సినిమా పడింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ తండేల్ ( Thandel ) .. గత ఏడాదిగా ఈ మూవీ ఊరిస్తూ వస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి 7 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది..130 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని తెలుస్తుంది. తండేల్ మూవీ చాలా తక్కువ టైమ్ లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత వారం రిలీజైన సినిమాలు కూడా ఏవీ మంచి టాక్ తెచ్చుకోకపోవడంతో తండేల్ ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీలతో థియేటర్లలో రన్ అవుతుంది.. 13 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం..


ఈ మూవీలో శ్రీకాకుళం రాజు పాత్రలో చైతూ, సత్య పాత్రలో మెగా పవర్ స్టార్ సాయిపల్లవి జీవించారు. ప్యూర్ లవ్ స్టోరీని వెండితెర పై పండించడం తో సినిమాకు ఆడియెన్స్ నుంచి మరింతగా మౌత్ పబ్లిసిటీ పెరిగింది. సంక్రాంతికి వచ్చిన విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తప్పా ‘తండేల్’ చిత్రానికి పెద్దగా పోటీ ఏదీ రాలేదు. చిన్న సినిమాల్లో ‘తండేల్’ కు వస్తున్న రెస్పాన్స్  చూస్తుంటే 500 కోట్లు రాబడుతుందని కొందరు ఫిక్స్ అవుతున్నారు. ఇప్పటివరకు తండేల్ మూవీ ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..

Also Read : ప్రభాస్‌కే అలాంటి కండిషన్స్ పెడతావా? సందీప్‌పై అభిమానులు ఫైర్..!


తండేల్కలెక్షన్స్ చూస్తే.. రోజు రోజుకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. కానీ తగ్గలేదు. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూల్ చెయ్యగా, ఎనిమిది రోజులకు 90.12 కోట్లు వసూల్ చేసింది.. తొమ్మిది రోజుల్లోనే 100 కోట్లను వసూల్ చేసి మంచి రికార్డును సొంతం చేసుకుంది. అలాగే పదకొండురోజులకు 120 వసూల్ చేసింది. 12 రోజులకు గాను 130 వరకు రాబట్టిందని తెలుస్తుంది.. మొత్తానికి స్లో గా 200 కోట్ల వైపు అడుగులు వేస్తుంది.. చూడాలి మరి ఏ మాత్రం వసూల్ చేస్తుందో..

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య కు తండేల్ మూవీ భారీ సక్సెస్ ను అందించింది. ప్రస్తుతం హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని టాక్.. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×