Director Subbu on Pawan Kalyan : సోలో బతికే సో బెటర్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుబ్బు. కరోనా లాక్ డౌన్ తర్వాత మొదటిసారిగా రిలీజ్ అయింది ఈ సినిమా. అయితే ఈ సినిమా మీద అప్పట్లో అందరికీ మంచి అంచనాలు ఉండేవి. ఈ సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సాయి తేజ్ నటించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని అల్లరినరేష్ తో బచ్చలమల్లి అనే సినిమాను చేస్తున్నాడు దర్శకుడు సుబ్బు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇ టీజర్ కి ప్రస్తుతం విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా అల్లరి నరేష్ క్యారెక్టర్ ను సుబ్బు డిజైన్ చేసిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.
ఇక ఈ సినిమా టీజర్ ఈవెంట్ కి కూడా అల్లరి నరేష్ ట్రాక్టర్ పైన వచ్చాడు. ఈ సినిమా మొదటి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు భగవద్గీత ప్లే అవుతూ ఉంటుంది అయితే అది పూర్తికాకముందే అల్లరి నరేష్ దానిని ఆపుతాడు. అయితే అప్పట్లో చాలామంది దీనిని అబ్జెక్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదిక ట్రోల్స్ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించిన ఇష్యూ క్లియర్ అయిందా అని ప్రముఖ జర్నలిస్ట్ నిర్మాతను అడగగా దీనికి దర్శకుడు సుబ్బు సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ లో ట్రోల్ చేసిన వాళ్లంతా కూడా బచ్చలపల్లి క్యారెక్టర్ లాంటివాళ్ళు. వాళ్లు ఒక మంచి విషయాన్ని పూర్తిగా వినరు. సినిమా చూసిన తర్వాత వాళ్లకి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడే వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకొని మళ్లీ పొగుడుతూ పోస్ట్ లు పెడతారు అంటూ సుబ్బు చెప్పుకొచ్చాడు.
ఇదే సందర్భంలో నేను కూడా హిందువుని. నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి. నాకు సనాతన ధర్మం మీద మంచి నమ్మకం ఉంది. నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని. ఆయన సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తుంటే నా వంతుగా కూడా నేను సహాయ పడటానికి సిద్ధం. అందుకోసమే నా సినిమాలో కూడా అలా చూపిస్తూ ఉంటాను. నేను ఇప్పుడు నా హిందుత్వాన్ని తక్కువ చేసుకోను. నా ఆచారాలని వదులుకోను అంటూ సుబ్బు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమాను రాజేష్ దండు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
Also Read : Game Changer Song: ‘గేమ్ ఛేంజర్’ నుండి నానా హైరానా పాట విడుదల.. శంకర్ మార్క్ కనిపిస్తోందిగా!