Bahubali 2:బాహుబలి (Bahubali).. ఈ మధ్యకాలంలో తొలి పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా అందించిన విజయం తో ఈ సినిమా ప్రీక్వెల్ గా బాహుబలి 2 (Bahubali 2) విడుదలై మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పాకిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా తొలి భాగం విడుదలై ఇప్పటికీ చాలా ఏళ్లవుతున్నా…ఇంకా సినీ జనాలను వేధిస్తున్న ప్రశ్న.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 లో సమాధానం ఇచ్చినా .. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి రెండవ భాగాన్ని ముగించాడు రాజమౌళి (Rajamouli). దీంతో ఇప్పుడు ఈ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఆ ప్రశ్నలేంటి? వాటికి మీరేమైనా సమాధానం చెప్పగలరేమో చూద్దాం.
1. తొలి భాగంలో కాలకేయల నేపథ్యం వాళ్ళ నాయకుడికి వివరాలను సవివరంగా చూపించిన చిత్ర యూనిట్, రెండో భాగంలో కుంతల రాజ్యం మీద దాడి చేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై ఎందుకు పెద్దగా దృష్టి పెట్టలేక పోయింది..?
2. బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాల దేవుడి కొడుకు భద్ర తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాల దేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరు అన్నది? మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.
3. తొలి భాగంలో ఏ సహాయం కావాలన్నా ఈ మిత్రుడు ఉన్నాడు అంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లామ్ ఖాన్.. రెండవ భాగంలో కనిపిస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన కనిపించలేదు.
4. కట్టప్ప బాహుబలిని చంపేసిన సన్నివేషంలో కాలకేయులు బాహుబలి పై దాడి చేస్తారు.. అసలు వాళ్లు ఎలా వచ్చారు..?
5. దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అవంతిక నేపథ్యం, కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇలా ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు.. ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. ఇంకా రాజమౌళి వీటికి సమాధానం చెప్పకుండానే అలాగే వదిలేయడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రాజమౌళి కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చూపించాలని అనుకున్నారట. కానీ సినిమా నిడివి ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో సెన్సార్ ఆదేశాల మేరకే కట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయాలను కూడా చూపించి ఉండి ఉంటే బాగుండేదని అభిమానులు కూడా తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాహుబలి క్యాస్టింగ్ విషయానికి వస్తే.. ప్రభాస్(Prabhas ), రానా (Rana) లాంటి దిగ్గజ నటీనటులు ఈ సినిమాలో పోటీపడ్డారు. ఇక రమ్యకృష్ణ (Ramyakrishna ) శివగామి పాత్రలో చాలా అద్భుతంగా ఒరిగిపోయింది. అవంతిక పాత్రలో తమన్నా(Tamannaah ), దేవసేన పాత్రలో అనుష్క(Anushka ) వారి వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక నాజర్, సత్యరాజ్ పాత్రలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇలా ఎవరికి వారు తమ శక్తికి మించిన సినిమాను అత్యంత ఘనవిజయం సాధించేలా చేశారు. ఏది ఏమైనా బాహుబలి సినిమా అటు కథ పరంగానే కాకుండా ఇటు రికార్డులు కూడా నెలకొల్పింది.
also read:Tollywood: 15 ఏళ్లకే స్టార్ స్టేటస్.. దానివల్లే దూరం అంటున్న స్టార్ హీరో..!