Balagam Actor: కంటెంట్ బేస్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. సినిమా పెద్దది చిన్నది అని కాకుండా బాగుంటే చూస్తారు అనడానికి నిదర్శనంగా చాలా సినిమాలు ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన బలగం సినిమా అంతే పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతోనే వేణు మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాని బాగా తెరకెక్కించి ప్రశంసలు పొందుకున్నాడు. ఎంతోమంది కొత్త నటులను ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వేణు. బలగం సినిమా నటుడు జీవి బాబు మృతి చెందడం పై వేణు సంతాపం వ్యక్తం చేశారు.
బలగం నటుడు మృతి
ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీవీ బాబు మరణంపై బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. ‘ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది’ అని పేర్కొన్నారు.