Tirumala News: తిరుమల ఏడు కొండల వెంకటేశ్వరస్వామిని ఎన్ని సార్లు చూచినా ఇంకా చూడాలనే కోరిక భక్తుల్లో మనసులో బలంగా ఉంటుంది. తిరుమలలో అడుగు పెట్టిన మొదలు అక్కడే ఉండాలని తపించే భక్తులు చాలామంది ఉన్నారు.. ఉంటారు కూడా. వెంకన్న మహత్యం అలాంటిది. స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీయడమే కాదు, పాపాలు సైతం తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలకు సీజన్‌తో పని లేదు. ప్రతీ రోజూ వేలల్లో భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు.
భక్తుల కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తాజాగా ఎన్నారై భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం తిరుమలలో కొత్త సేవను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆ సేవ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈవో శ్యామలరావు డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. శనివారం టీటీడీ పరిపాలనా భవనంలో 14 దేశాలకు చెందిన ఎన్నారైలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.
వారి నుంచి సమాచారం తీసుకున్నారు. ముఖ్యంగా మెడిసిన్, ఐటీ, ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలందించేందుకు ముందుకు రానున్నారు ఎన్నారైలు. ఎన్నారై సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ఈఓ శ్యామలరావు. అలాగే ఎన్నారైలు శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోమాత సేవ చేసేందుకు కొత్తగా ‘గో సేవ’ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు.
తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు ఈవో శ్యామలరావు. ఇప్పటికే టీటీడీ పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటు చేశామన్నారు. వివిధ దశల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, రెండో దశలో అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మూడో దశలో ఒంటిమిట్ట కోదండ రామాలయం చివరగా తిరుమలలోని ఆకాశగంగ, పాపవి నాశనం అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాస్టర్‌ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.
ALSO READ: భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరు టీడీపీ నేతల దారుణహత్య
తిరుమలలో ఆదివారం సర్వ దర్శనం టోకెట్ల విషయానికొద్దాం. మే 25న శ్రీవారి మెట్టు వద్ద రెండువేల ఆరు వందల(2,600) సర్వ దర్శనం టోకెన్లను విడతల వారీగా విడుదల చేయనుంది టీటీడీ. ఆదివారం మధ్యాహ్నం ఒంటి నుంచి ఐదు గంటల వరకు మొదలవుతుంది. ప్రతీ గంటకు టోకెట్లను ఇవ్వనుంది. సాయంత్రం ఐదు గంటలకు మాత్రం వెయ్యి టోకెట్లను విడుదల చేయనుంది.