E-Paper
Advertisement

IPL 2025:ముంబై కోసం పని చేస్తున్న ఎలిమినేట్ టీమ్స్.. ఇవి అంబానీ కుట్రలేనా

IPL 2025:ముంబై కోసం పని చేస్తున్న ఎలిమినేట్ టీమ్స్.. ఇవి అంబానీ కుట్రలేనా
Advertisement

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. అయితే వీటిలో ప్లే ఆప్స్ కి చేరుకున్నటువంటి జట్లకు ప్లే ఆప్స్ చేరుకోని జట్లు షాక్ ఇస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ని లక్నో సూపర్ జెయింట్స్ ఓడించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. నిన్న  పంజాబ్ కింగ్స్ వర్సెస్  ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎలిమినేట్ అయిన టీమ్స్ ముంబై కోసం పని చేస్తున్నాయని ట్రోలింగ్స్ జరుగుతోంది. మరోవైపు ఇవి అంబానీ కుట్రలేనా..? అని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

Also Read : RCB-Calculator: RCBకి Calculatorకు ఏం సంబంధం.. ఎందుకు ఈ ట్రోలింగ్

Advertisement

గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ మొన్న జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీ సాధించి లక్నో సూపర్  జెయింట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 33 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 231 పరుగులు చేసింది. అయితే 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలాగే నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 206 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 44 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సమీర్ రిజ్వి కూడా 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ అనూహ్యంగా చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా విజయం సాధించింది.

వాస్తవానికి ప్లే ఆప్స్ కి అర్హత సాధించేశామని.. ఇక టాప్ 2లో చోటు దక్కించుకుందాం అనుకుంటారు. కానీ ప్లే ఆప్స్ కి దూరమయ్యాక ఎలాంటి ఒత్తిడిలేకపోవడంతో చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి అవకాశాలను దెబ్బ తీస్తున్నాయి అవతలి జట్లు. ప్లే ఆప్స్ సాధించిన జట్లు టెన్షన్ పడుతుంటే.. ప్లే ఆప్స్ కి అర్హత సాధించని జట్లు చాలా ధైర్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 18, పంజాబ్ 17, బెంగళూరు 17, ముంబై 16 పాయింట్లతో వరసగా ఉన్నాయి. ఢిల్లీ చేతిలో తాజా ఓటమితో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. టాప్ 2 కోసం ముంబై నుంచి ప్రమాదం మాత్రం పొంచి ఉంది. గ్రూప్ దశలో పంజాబ్ వర్సెస్ ముంబై మధ్య తమ చివరి మ్యాచ్ జరుగనుంది. ముంబై విజయం సాధిస్తే.. 18 పాయింట్లతో ముందుకు దూసుకుపోతుంది. పంజాబ్ 17 పాయింట్లతో లీగ్ స్టేజ్ ను ముగించాల్సి వస్తుంది. ముంబైకి రెండో స్థానం ఖాయమని భావించలేము. రేసులో గుజరాత్, బెంగళూరు జట్లు కూడా ఉన్నాయి. ఇవాళ జరగబోయే మ్యాచ్ లో గుజరాత్ జట్టు చెన్నై పై ఓడిపోతే.. ఫలితాలు మరోలా ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తానికి సోషల్ మీడియాలో ముంబై కోసమే ప్లే ఆప్స్ కి వెళ్లిన జట్లు ఓడిపోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×