BigTV English

Border tensions: సరిహద్దుల్లో అలజడి.. భారత సైన్యంపై పాక్ కాల్పులు, కాశ్మీర్‌కు ఆర్మీ చీఫ్

Border tensions: సరిహద్దుల్లో అలజడి..  భారత సైన్యంపై పాక్ కాల్పులు, కాశ్మీర్‌కు ఆర్మీ చీఫ్

Border tensions: పహల్‌గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయా? గత అనుభవాల నేపథ్యంలో యుద్ధానికి పాకిస్థాన్ కాలు దువ్వుతుందా? సరిహద్దు వెంబడి రెచ్చిగొట్టే చర్యలకు పాల్పడుతుందా? ఇప్పటికే సరిహద్దులకు బలగాలను పంపిన పాక్, ఆ పనిలో నిమగ్నమైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు బోర్డర్‌లో ఏం జరుగుతోందన్న టెన్షన్ సామాన్యూడి సైతం వెంటాడుతోంది.


ఎల్ఓసీ  వెంబడి కాల్పులు

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఎప్పుడైనా భారత్ తమపై దాడి చేయవచ్చని భావించింది దాయాది దేశం పాకిస్థాన్. ఈ క్రమంలో సరిహద్దుల్లో అదనపు బలగాలను మొహరించింది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం భారత దశాలలపై కాల్పులకు దిగింది.


పాకిస్థాన్ చర్యలకు గట్టిగా బదులిస్తోంది భారత సైన్యం. పాక్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాకపోతే ఇప్పటికే అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంటుందని అంటున్నారు.

పాక్ కవ్వింపు చర్యలు

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుతూ పాక్ సైన్యం కయ్యానికి కాలు దువ్వడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఏ క్షణమైనా భారత్ సర్జికల్ స్ట్రైక్ చేయవచ్చని అంచనా వేసింది పాకిస్థాన్. అప్రమత్తమైన ఆదేశ సైన్యం యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన వైమానిక స్థావరాలకు పంపించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం కాశ్మీర్‌కు వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ఆర్మీ కమాండర్లు, భద్రతా ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ALSO READ: ఉగ్రదాడులు ప్రభుత్వమే చేయించింది, బుక్కైన ఎమ్మెల్యే, ఎక్కడ?

పుల్వామా ఘటన తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్ చేపట్టిన విషయం తెల్సిందే. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఆదేశ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ఉన్నారు. పాక్‌పై భారత్ దాడి చేస్తుందని ఒకానొక దశలో భయపడినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు.

దీనికితోడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించింది పాకిస్తాన్. అందుకే కయ్యానికి కాలు దువ్వుతుందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్‌ని దోషిగా నిలబెట్టి అప్పుడు చర్యలు చేపడితే ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

సరిహద్దులు మూసివేత

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సింధు జలాల ఒప్పందం తాత్కాలిక రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. అలాగే దౌత్యపరమైన ఆంక్షలు సైతం విధించింది. దీనికి ప్రతీకారంగా భారత్‌కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్. సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగినట్టు ప్రకటన చేసింది కూడా.

పాకిస్థాన్‌లో సార్క్‌ వీసా మినహాయింపు స్కీమ్ ద్వారా పర్యటిస్తున్న భారతీయులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని అమాంతంగా తగ్గించింది. అట్టారీ బోర్డర్‌ మూసి వేయాలని భారత్‌ నిర్ణయించింది. ఇరు దేశాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అక్కడ షాపులు పెట్టుకున్నవారు ఎవరి దేశానికి వారు వెళ్లిపోయారు. భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా వాఘా బోర్డర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్.

 

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×