The Raja Saab:రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)..ఒకప్పుడు టాలీవుడ్ హీరోగా పేరు సొంతం చేసుకొని, ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఏడాదికి తన నుండి రెండు సినిమాలు విడుదల చేస్తానని అభిమానులకు ప్రామిస్ చేసిన ప్రభాస్.. అందుకు తగ్గట్టుగానే తన సినిమా షూటింగ్లను వేగవంతం చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సుమారుగా 6 ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. ఇకపోతే గత ఏడాది నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898AD’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పటివరకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ప్రభాస్ రాజాసాబ్ కోసం ఆడియన్స్ వెయిటింగ్..
ఈ సినిమా తర్వాత రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 అంటూ ఇలా పలు చిత్రాలు లైన్లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Maruthi) దర్శకత్వంలో హార్రర్, కామెడీ జోనర్లో రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు కొన్ని అప్డేట్స్ వదిలి మళ్లీ సినిమాపై ఎటువంటి అప్డేట్ వదల్లేదు. దీనికి తోడు ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇక దీనికి తోడు అప్పటినుంచి సినిమాపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఏం జరుగుతోంది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఇటలీ టూర్ లో ఉన్నాడని తెలిసి ఇక రూమర్స్ కూడా ఆగిపోయాయి.
మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర బృందం..
అయితే ఇప్పుడు వెకేషన్ ముగించుకొని వచ్చిన ప్రభాస్ హైదరాబాదులో అడుగు పెట్టాడు. దాంతో షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay dutt) పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు మొదలైన ఈ షెడ్యూల్లో త్వరలోనే ప్రభాస్ కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరొకవైపు టీజర్ కూడా రెడీ చేస్తున్నారు. ప్రభాస్ ఇంకా డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ డేట్ పై కూడా అనౌన్స్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా టీజర్ తర్వాత దర్శకుడు మారుతీ పనితో పాటు సినిమా గురించి కూడా గొప్పగా మాట్లాడుకునే సమయం వస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండడం గమనార్హం. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.మరొకవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఫౌజీ, స్పిరిట్ సినిమాలను లైన్లో పెట్టనున్నారు ప్రభాస్. మరి రాబోయే సినిమాలతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ALSO READ:Urvashi Rautela: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊర్వశీ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతంటే..?