BigTV English
Advertisement

Balakrishna: బెంగాల్ లో బాలయ్య క్రేజ్.. ఆ స్టార్ హీరోలు కూడా దిగదుడుపే..!

Balakrishna: బెంగాల్ లో బాలయ్య క్రేజ్.. ఆ స్టార్ హీరోలు కూడా దిగదుడుపే..!

Balakrishna:టాలీవుడ్ స్టార్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఏడుపదుల వయసుకు చేరుతున్న సమయంలో కూడా యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అవుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు విజయాన్ని సొంతం చేసుకొని, అక్కడ సక్సెస్ లెగస్సీ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ ఆహా ఓటీటీ తెలుగు వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ కూడా చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.


సక్సెస్ లెగస్సీ కొనసాగిస్తున్న బాలయ్య..

ఇక ఇలా ఈ వయసులో కూడా ఇంత చలాకీగా ఉంటూ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈయనకు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మభూషణ్ కూడా లభించింది. ఇక ఇంతలా పేరు దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వయసులో కూడా నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ.. ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య క్రేజ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయింది అనుకుంటే పొరపాటే. ఆయన సినిమాలను నార్త్ ఆడియన్స్ కూడా ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు అనడానికి మహా కుంభమేళాలో కనిపించిన ఒక దృశ్యమే నిదర్శనం అని చెప్పవచ్చు.


మహా కుంభమేళాలు బాలకృష్ణ పెయింటింగ్ తో నిండిపోయిన బస్..

144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళకు దేశం నలుమూలల నుండి భక్తులు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రైవేట్ బస్సులు, ట్రైన్లు, కార్ల ద్వారా కోట్లాదిమంది ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. ఇక అయితే వెస్ట్ బెంగాల్ నుండి కొంతమంది భక్తులు ఒక స్పెషల్ బస్ ని బుక్ చేసుకొని రావడం , ఆ బస్సు మొత్తాన్ని బాలయ్య బాబు పెయింటింగ్స్ తోనే నింపేయడం, అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ‘అఖండ’ సినిమాలో బాలయ్య గెటప్ తో పాటు బాలయ్య నటించిన సినిమాల పోస్టర్లు ఆ బస్సు మొత్తం నిండిపోయాయి. ఇక ఈ ఫోటో చూసిన ఆడియన్స్ బాలయ్య కి నార్త్ ఇండియాలో ఇంత క్రేజ్ వుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అభిమానాన్ని ఇప్పటివరకు చూడలేదని , అలాంటిది ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఇలాంటి అభిమానం చూపించారంటే ఇక ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు .

సెప్టెంబర్ 25న అఖండ 2..

ఇకపోతే బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదలై చాలా రోజులవుతున్నా.. హిందీలో డబ్ చేసి విడుదల చేశారు . కానీ పబ్లిసిటీ చేయకపోవడం వల్ల అక్కడ సరిగా ఆడలేదు. ఒకవేళ ఇదే అఖండ చిత్రాన్ని హాట్ స్టార్ లో అప్లోడ్ చేసినప్పుడు హిందీ ఆడియన్స్ మాత్రం ఎగబడి చూశారట. ఇక ఆయన మాస్ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు సమాచారం. ఏది ఏమైనా బెంగాల్ ప్రాంతంలో బాలయ్య కి ఉన్న క్రేజ్ ముందు పాన్ ఇండియా హీరోలు కూడా దిగదుడుపే అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×