Ajith: కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలు ప్రేక్షకులకు కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. ఏదైనా సోషల్ మెసేజ్ కూడా అందిస్తే బాగుంటుంది అనే భావనలో ఉంటారు. అందుకే దాదాపు ప్రతీ స్టార్ హీరో సినిమాలో ప్రేక్షకులను చలించేలా చేసే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా ఈ కేటగిరికి చెందినవాడే అని తాజాగా బయటపెట్టాడు ఓ దర్శకుడు. ప్రస్తుతం బయట సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు అజిత్‌ను బాగా కదిలించాయని, అందుకే ‘పట్టుదల’ సినిమాలో అలాంటి అంశాన్ని యాడ్ చేయాలని తను ముందు నుండే ఫిక్స్ అయ్యి ఉన్నాడని రివీల్ చేశాడు డైరెక్టర్ మగిర్ తిరుమేని (Magizh Thirumeni).
మెసేజ్ ఉండాలి
స్టార్ హీరో అజిత్ (Ajith) చాలా సెన్సిటివ్ వ్యక్తి. బయట జరిగే అన్యాయాల గురించి ఆయన ఓపెన్‌గా స్పందించినా స్పందించకపోయినా అలాంటి విషయాలు ఆయనను బాగా కదిలిస్తాయని సన్నిహితులు చెప్తుంటారు. హత్యలు, యాసిడ్ అటాక్.. ఇలా ఆడవారిపై జరిగే ఏ అన్యాయం గురించి చూసినా కూడా అజిత్ బాగా ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతుంటారు. అందుకే ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’తో దీనికి సంబంధించిన ఏదో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉండాలని దర్శకుడు మగిర్ తిరుమేనితో ముందే చెప్పారట అజిత్. తన జీవితంలో ఉన్న ఆడవారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఒక వ్యక్తి పడే తపనే ‘పట్టుదల’ కథ.
చెప్పారు.. చేశాను..
ఫిబ్రవరి 6న ‘పట్టుదల’ (Pattudala) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తమిళంలో ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi) అనే పేరుతో విడుదలయ్యింది. అయితే తమిళంలో ఈ సినిమాకు పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చినా తెలుగులో మాత్రం డిశాస్టర్‌గా నిలిచింది. తమిళ ప్రేక్షకుల ఈ మూవీని ఆదరించడం చూసి దర్శకుడు మగిర్ తిరుమేని స్పందించాడు. ‘‘అజిత్‌కు నా మీద ఉన్న నమ్మకానికి థాంక్యూ. మేము మీట్ అయిన మొదట్లో ఆడవారిపై గౌరవాన్ని చూపించే సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టమని నాకు పదేపదే చెప్తుండేవారు. ఆయన నాతో ఈ మాట చెప్పినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా అలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుండే వచ్చాను’’ అని చెప్పుకొచ్చాడు మగిర్.
Also Read: అవి అలాంటి వీడియోలు కాదు.. మస్తాన్ సాయి కేసు విషయంలో నిఖిల్ క్లారిటీ
నమ్మకం నిలబెట్టారు
‘‘మా ఐడియా లైకా ప్రొడక్షన్స్‌కు కూడా నచ్చి సపోర్ట్ చేసింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్లను మాత్రమే తెరకెక్కించే అలాంటి ప్రొడక్షన్ హౌస్ నుండి సపోర్ట్ దొరకడం సంతోషంగా అనిపించింది. ఒక దర్శకుడిగా అజిత్ నుండి తన ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు ఆశిస్తారో నాకు తెలుసు. అలాంటి ఎలిమెంట్స్ కూడా విడాముయర్చిలో యాడ్ చేయడానికి ప్రయత్నించాను. దీనిని తన ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారని అజిత్ నమ్మారు. సినిమా రిలీజ్ అయ్యి రెస్పాన్స్ చూసిన తర్వాత అజిత్‌కు తన ఫ్యాన్స్‌పై ఉన్న నమ్మకం కనిపిస్తోంది. అందరి దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు దర్శకుడు మగిర్ తిరుమేని.