Daaku Maharaj Movie Review and Rating : సంక్రాంతి పోటీలో మూవీ నిలిచిందంటే… కచ్చితంగా హిట్ బొమ్మే అనుకుంటారు. అలాగే బాలయ్య కూడా వరుస హిట్స్‌తో జోరు మీద ఉన్నాడు. డైరెక్టర్ బాబీ లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య మూవీ కూడా 2023 సంక్రాంతికి వచ్చి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ బాబీ 2025 సంక్రాంతికి బాలయ్యతో పోటీలో ఉన్నాడు. మరి ఈ సారి కూడా బాబీ సంక్రాంతి విన్నర్ అయ్యాడా.? బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బాలయ్యకు డాకు మహారాజ్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్ధాం…
కథ :
ఏపీలోని చిత్తూరు జిల్లా మధనపల్లిలో కృష్ణమూర్తి (సచిన్ ఖడ్కేర్)కు పాఠశాలలతో పాటు, కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి. ఆ కాపీ ఎస్టేట్స్‌ను లోకల్ ఎమ్మెల్యే త్రిముర్తులు (రవి కిషన్) లీజ్‌కు తీసుకుని, వన్యమృగాలను వేటాడి, వాటి చర్మం, దంతాలను తీసుకుని అక్రమంగా తరలిస్తాడు. ఇది కృష్ణమూర్తి మనమరాలు బేబీ వైష్ణవి ( వేదా అగర్వాల్ ) వల్ల తెలిసిపోతుంది. దీంతో కృష్ణమూర్తి ఫ్యామిలీతో పాటు బేబీ వైష్ణవి ప్రాణం కూడా ప్రమాదంలో ఉంటుంది. ఈ విషయాన్ని అక్కడ పనిమనిషిగా ఉన్న ముకుంద్ (మకరంద్ దేశ్ పాండే)… చంబల్‌లో ఉన్న డాకు మహారాజ్ (నందమూరి బాలకృష్ణ) కి చెబుతాడు. దీంతో డాకు మహారాజ్ పాప ప్రాణాలను కాపాడాటానికి నానాజీగా పేరు మార్చుకుని మధనపల్లిలో డ్రైవర్ గా చేరుతాడు.
ఎక్కడో చంబల్‌లో జిల్లాలో ఉన్న డాకు మహారాజ్ పాప ప్రాణం కోసం ఎందుకు వస్తాడు.? పాపకు డాకు మహారాజ్‌కు సంబంధం ఏంటి.? అసలు ఓ ఇంజనీర్ డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు.? కాపీ ఎస్టెట్‌లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి. బలవంత్ సింగ్ ఠాకూర్ ఏం బిజినెస్ చేస్తున్నాడు? దాన్ని డాకు మహారాజ్ ఎలా అడ్డుకున్నాడు ? చివరికి పాప ప్రాణాలను డాకు కాపాడాడా? అనేవి తెలియాలంటే… సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
డాకు మహారాజ్‌లో రెండు స్టోరీలు ఉన్నాయి.
ఒకటి… తనకు ఎలాంటి సంబంధం లేని ఓ గ్రామం కోసం హీరో అన్ని త్యాగాలు చేసుకుని, విలన్‌తో పోరాటం చేసి గెలుస్తాడు.
రెండు… ఒక పాప ప్రాణాల కోసం తన గుర్తింపు మార్చుకుని, ఆ పాప ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేసి మరీ కాపాడుతాడు.
ఈ రెండు రోటీన్ కథలను డైరెక్టర్ బాబీ తన స్టైల్‌ని కాస్త తగ్గించి బాలయ్య స్టైల్‌ను భారీగా పెంచి చేసిన సినిమానే డాకు మహారాజ్.
బాలయ్య సినిమా అంటే డైరెక్టర్స్ ఎవరైనా… సినిమా షూటింగ్ అవ్వకముందే ఫిక్స్ అయిపోతారేమో… బాలయ్య సినిమా హిట్ అవ్వాలంటే… మితిమీరిన యాక్షన్, అడుగుఅడుగునా ఎలివేషన్ ఉండాలని. బాలయ్యను ఈ సినిమాలో బాబీ కొత్తగా చూపించింది ఏం లేదు. అదే ఎలివేషన్స్, అదే ఎక్స్‌ట్రా డోస్ యాక్షన్.
కానీ, ఇక్కడ బాబీని మెచ్చుకోవాల్సింది ఏంటంటే… రోటీన్ కథే అయినా… కాస్త మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇదే సినిమాకు ప్లస్ పాయింట్. అలాగే బాలయ్య కాంబోని కంటీన్యూ చేస్తూ ఎస్ ఎస్ థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకోవడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. థమన్ కాకుండా ఎవరూ కూడా ఈ మూవీకి న్యాయం చేయరేమో. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ అయితే… “తమిళ్ లో రజినీకాంత్ కు బక్కోడు ఉంటే, తెలుగులో మా బాలయ్య కు బండోడు ఉన్నాడు” అని కాలర్ ఎగరవేసి మరీ చెబుతారు.
కథను ఇటు ఆంధ్ర ప్రదేశ్, అటు చంబల్ అంటూ నడుపుతూ కొత్తగా ప్లాన్ చేసినా… రోటీన్ గానే కనిపిస్తుంది. చంబల్‌లో కథ నడిపడం అనేది మూవీకి బడ్జెట్ పెంచడమే తప్పా.. పెద్దగా ఉపయోగం లేదు. అలాగే బాబీ డియోల్‌ను సిమ్లాలో చూపిస్తారు. చంబల్‌లో ఉండాల్సిన విలన్… సిమ్లాకు ఎందుకు వెళ్లాడు.? చంబల్‌లో సర్వం కోల్పోయిన తర్వాత అక్కడ ఎవరు షెల్టర్ ఇచ్చారు అనే డిటైల్స్ కూడా లేవు.
సినిమా స్టార్టింగ్‌లో హీరో ఇంట్రడక్షన్ ను హై లెవెల్‌లో చూపించాడు. కానీ, తర్వాత పాత్రల పరిచయం కోసం కాస్త ల్యాగ్ చేశాడు. చిన్నారి వైష్ణవి పాత్రను రివీల్ చేయడంలో కూడా కాస్త స్పీడ్ పెంచాల్సింది. కథలో నానాజీ ఎంట్రీ వచ్చే వరకు మూవీ స్లోగానే సాగుతుంది. తర్వాత హీరో రావడం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి (షాన్ టామ్ చాకో) ఇంట్రాగేషన్‌లో హీరోకు పడిన ఎలివేషన్స్ బాగున్నాయి.
తర్వాత 20 నిమిషాల పాటు సాగే ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ఇది బాలయ్య ఫ్యాన్స్‌తో ఈలలు, అరుపులు వేయిస్తుంది. సూపర్ హైప్‌తో సెంకండాఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ, సెంకండాఫ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం మళ్లీ మైనస్. ఇంజనీర్ సీతారాం పాత్రలో బాలకృష్ణ బాగానే ఉన్నా.. ఆ ఎపిసోడ్ పేలవంగా నడిచినట్టు అనిపిస్తుంది. సీతారం… డాకు మహారాజ్‌గా మారిన సీన్, ఇసుక తూఫాన్ ఫైట్ సీన్ మెప్పిస్తుంది.
ఇక సినిమాకు ఎంత కీలకమైన క్లైమాక్స్‌ను మరింత బాగా డిజైన్ చేయాల్సింది. కథను మాత్రమే కాదు.. క్లైమాక్స్ ను ప్రిడిక్ట్ చేసేలా ఉంది. ఒక బుల్లెట్, 16 కత్తి పోట్లు పడిన తర్వాత కూడా బాలయ్య… అంత మందిపై ఫైట్ చేయడం లాజిక్ కు అందదు. హీరో కాబట్టి… నడుస్తుంది అనుకోవచ్చు.. అయినా… క్లైమాక్స్ ఫైట్ అసంతృప్తిగానే ముగుస్తుంది.
బాలయ్య ఫర్ఫామెన్స్ గురించి కొత్తగా ఏం చెప్పడానికి ఏం ఉంటుంది. ఇంకా… తగినన్ని ఎలివేషన్స్, యాక్షన్, మాస్ డైలాగ్స్ ఉన్నా మూవీ ఇది. ఇవి అన్ని ఉన్న తర్వాత బాలయ్య నుంచి ఎలాంటి ఫర్ఫామెన్స్ అంచనా వేస్తామో.. అలా చేశాడు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కంటే… శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఊర్వశీ రౌటేలా స్పెషల్ సాంగ్‌తో పాటు ఓ పాత్ర చేయడంతో స్క్రీన్ పై కాస్త గ్లామర్ టచ్ వచ్చింది. బాబీ డియోల్… స్టైలీష్ విలనీజం బాగుంది. ఇక పాప పాత్రలో చేసిన వేదా అగర్వాల్ యాక్టింగ్ బాగుంది. వ్యూచర్‌లో చైల్డ్ పాత్రల్లో మరిన్ని సార్లు కనిపించే ఛాన్స్ ఉంది.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ
థమన్ మ్యూజిక్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
రోటీన్ స్టోరీ
సెకండాఫ్
రోటీన్ క్లైమాక్స్
మొత్తంగా… బాలయ్య ఫ్యాన్స్‌ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేసే మూవీ
Daaku Maharaj Movie Rating : 2.25/5