Daaku Maharaj:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ మధ్య గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాని మాస్ డైరెక్టర్ బాబీ(Bobby) పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఇప్పటికే అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ ఉండగా.. ఇంతలోనే ‘చిన్ని’ అంటూ వచ్చిన రెండవ పాట కూడా ఎమోషనల్ టచ్ తో సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. ముఖ్యంగా బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ (Thaman).. తన టాలెంట్ కి మరింత పదును పెట్టారు. అందులో భాగంగానే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా ఈ స్కోర్ తో థియేటర్ బాక్సులు బద్దలవ్వడం గ్యారెంటీ అని నాగవంశీ కూడా చాలా కాన్ఫిడెంట్గా తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా డాకు మహారాజ్ రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.
డాకు మహరాజ్ సినిమా నిడివి..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫైనల్ రన్ టైం 2 గంటల 24 నిమిషాలు అన్నట్టు సమాచారం. మొత్తంగా టైటిల్ క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్ లు అన్నీ కలుపుకొని 2:32 గంటల రన్ టైం తో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రెండున్నర గంటలూ.. బాలయ్య మాస్ జాతరకు, తమన్ తాండవానికి థియేటర్ బాక్సులు బద్దలు అవ్వడం ఖాయమని అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా నిడివి పై మేకర్స్ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ , సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను సంయుక్తంగా నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా మరొకసారి మాస్ అభిమానులు ఊగిపోయేలా తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు బాలయ్య. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు..
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా రాజకీయ నాయకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా హిందూపురం నుండి మూడుసార్లు శాసనసభకు ఎంపిక అయి హ్యాట్రిక్ అందుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి అయిన ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా నడుస్తోంది. ఇక ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటారు. అంతేకాదు తన సినిమాలలో అప్పుడప్పుడు పాటలు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక్కటేమిటి బాలయ్య గురించి చెప్పాలంటే బోలెడు అంశాలున్నాయి. అందుకే ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు నెటిజన్స్..