Sim Activation Plans : ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ ఎప్పటికప్పుడు తమ యూజర్స్ కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ డేటా, ఎస్ఎంఎస్, కాల్స్ కు సంబంధించి ఎన్నో ప్లాన్స్ వచ్చినప్పటికీ కేవలం సిమ్ యాక్టివేషన్ కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ లేవు. రెండు సిమ్స్ వాడే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా వొడాఫోన్ ఐడియా సరికొత్త బడ్జెట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Vodafone Idea (Vi) బడ్జెట్లోనే రెండు సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ. 150 కంటే తక్కువ ధరతో యూజర్స్ కోసం వచ్చేసాయి. అయితే అరుదుగా కాల్స్ తో పాటు ఇంటర్నెట్ ని ఉపయోగించాలనుకునే యూజర్స్ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ధరకే సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ రెండు ప్లాన్స్ లో ఒకటి రూ. 128 కాగా రెండోది రూ. 138. ఇందులో మొదటి ప్లాన్ లో 18 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 100 mb డేటా ఉంటుంది. ఇక ఇందులో 10 లోకల్ ఆన్ నెట్ నైట్ నిమిషాలను 11 PM నుంచి 6 AM మధ్య ఉపయోగించవచ్చు. అయితే, ఈ ప్లాన్ లో లోకల్ అండ్ నేషనల్ కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు ఖర్చు అవుతుంది. ఇక ఉందులో SMS పంపే ఛాన్స్ లేదు.
ఇక రెండో ప్లాన్ రూ. 138 ప్లాన్. ఇది 20 రోజుల వ్యవధితో వచ్చేసింది. రూ.128 ప్లాన్ మాదిరిగానే 11 PM నుంచి 6 AM మధ్య 10 లోకల్ ఆన్ నెట్ నైట్ నిమిషాలను, 100MB మొబైల్ డేటాను పొందువచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో లోకల్ అండ్ నేషనల్ కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు ఖర్చు అవుతుంది. ఇక ఉందులో SMS పంపే ఛాన్స్ కూడా లేదు. అయితే ఈ కొత్త రూ.128, రూ.138 ప్లాన్‌లు అన్ని ప్రాంతాలలో అందుబాటులో లేవు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, చెన్నై, కేరళ, కోల్‌కతా వంటి కొన్ని సర్కిళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి.
ప్రస్తుతం ఇండియాలో ప్రైవేట్ టెలికాం సంస్థల మధ్య ఎలాంటి పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పోటీని బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్లాన్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ కంపెనీలతో పోటీ పడుతూ Vi ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కొత్త “సూపర్ హీరో” ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇందులో 12 AM నుండి 12 PM వరకు అపరిమిత మొబైల్ డేటాను అందిస్తోంది. అలాగే నెట్‌వర్క్ ఆపరేటర్ ఎంపిక చేసిన సర్కిల్‌లలో 5G సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.
ఇక ఇప్పటికే యూజర్స్ సౌలభ్యం కోసం ట్రాయ్ టెలికాం కంపెనీలకు సరికొత్త ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. సిమ్ యాక్టివేషన్ లో ఉంచాలనుకునే యూజర్స్, డేటా అవసరం లేని యూజర్స్ కోసం సరికొత్త ప్లాన్స్ ను తీసుకురావాలని తెలిపింది. ఇక కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ తో డేటా లేకుండా ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురావలని తెలిపిన సంగతి తెలిసిందే.
ALSO READ : యూట్యూబ్ లో ఏం చూడాలో కన్ఫూజ్ అవుతున్నారా! ఈ కొత్త ఫీచర్ గైడెన్స్ మీ కోసమే!