Gaddar Awards: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అవార్డులను(Gaddar Award) ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు హైటెక్ సిటీలో ఈ గద్దర్ అవార్డు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతోమంది సినీ ప్రముఖుల సమక్షంలో రాజకీయ నాయకుల సమక్షంలో ఈ వేడుక మరింత కన్నుల పండుగగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తో పాటు డిప్యూటీ సీఎం అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా పలువురు సినీ సెలబ్రిటీలకు అవార్డులను అందజేశారు.
10 లక్షల నగదు…
రేవంత్ రెడ్డి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు తన చేతుల మీదుగా అవార్డ్ అందజేశారు. అనంతరం నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna)ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కూడా రేవంత్ రెడ్డి అందజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దిక్సూచి అయిన దివంగత నటుడు నందమూరి తారక రామారావు ఇండస్ట్రీకి అందించిన సేవలకు గుర్తుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించారు అయితే ఈ అవార్డును ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణకు అందజేయడం విశేషం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు.
చిరస్థాయిగా నిలిచిపోయిన గద్దర్ పేరు..
ఇక ఈ అవార్డును అందుకున్న తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముందుగా గద్దర్ పేరు మీద సినిమా ఇండస్ట్రీకి కళాకారులకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గద్దర్ గారి సేవలు మర్చిపోలేము అలాంటిది ఆయన పేరు మీదగా ఈ అవార్డులను ప్రకటిస్తూ గద్దర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బసవతారకం ట్రస్ట్..
ఇక నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తన తండ్రి సినిమా ఇండస్ట్రీకి చేసిన గొప్పతనం గురించి బాలయ్య వివరించారు. ఇక ఈ అవార్డు అందుకోవడంతో బాలకృష్ణకు పది లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందజేశారు. అయితే ఈ పది లక్షల రూపాయలను తాను బసవతారకం హాస్పిటల్ కోసం ఉపయోగిస్తున్నారని ఈయన బసవతారకం ట్రస్ట్ (Basavatarakam Trust) కు విరాళంగా ఇవ్వబోతున్నట్లు వేదిక పైన ప్రకటించారు. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఈ పది లక్షల రూపాయలు కూడా బసవతారకం ట్రస్ట్ కు అందచేయబోతున్నట్లు బాలయ్య చెప్పటంతో బాలయ్య మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు.