Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లో కచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోవాల్సింది. అందుకే వారి ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలన్నా.. ఫైనల్ వీక్‌లోకి అడుగుపెట్టాలన్నా.. ప్రేక్షకుల సపోర్ట్ కావాలి. అందుకోసమే కంటెస్టెంట్స్.. ప్రేక్షకులతో నేరుగా మాట్లాడడం కోసం ఓటు అప్పీల్ టాస్క్‌లను ప్రారంభించారు బిగ్ బాస్. ఇప్పటికే పూర్తయిన ఓటు అప్పీల్ టాస్క్‌లో ప్రేరణ గెలిచి ప్రేక్షకులకు తన ఓటు అప్పీల్ చేసుకుంది. ఇక తర్వాత టాస్కులు ఏంటి, ఎవరు గెలుస్తారు అనేదానికి సంబంధించి ప్రోమో విడుదలయ్యింది. అంతే కాకుండా ఈరోజు హౌస్‌లోకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా రానున్నారని ప్రోమోలో రివీల్ అయ్యింది.
మెగా చెఫ్
‘‘ఓటు అప్పీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి ఛాలెంజ్.. టర్ఫ్ వార్. ప్రతీ రౌండ్‌లో కోర్టు నుండి ఎవరైతే ముందుగా బయటికి వెళ్తారో.. ఆ ఒక్క సభ్యుడు ఛాలెంజ్ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది’’ అని బిగ్ బాస్ వివరించడంతో ప్రోమో మొదలవుతుంది. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా ఇతర కంటెస్టెంట్స్‌ను రింగ్‌లో నుండి బయట పడేయడంపైనే ఫోకస్ పెట్టారు. టాస్క్ పూర్తయ్యి హౌస్‌లోకి వచ్చే చూసేసరికి వారికోసం ఫేమస్ చెఫ్ సంజయ్ ఎదురుచూస్తున్నారు. ‘‘ఒక మంచి ఫుడ్ వడ్డించాలని ఈరోజు వచ్చేశాను’’ అంటూ కంటెస్టెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు సంజయ్. ‘‘థాంక్యూ. వీళ్లు వండింది తినలేక చస్తున్నాం. మీరే ఏదో ఒకటి చేయండి’’ అని రోహిణి అనడంతో అందరూ నవ్వుకున్నారు.
Also Read: డేంజర్ జోన్ లో అరుంధతి.. ప్రేరణ దెబ్బకు నిఖిల్ విలవిల..!
గొప్పగా చెప్పారు
‘‘ప్రపంచంలో ఏదైనా మంటల్లో వేస్తే అది బూడిద అయిపోతుంది. కేవలం బంగారం, ఫుడ్ మాత్రమే అద్భుతంగా బయటికొస్తుంది’’ అంటూ ఫుడ్ గురించి గొప్పగా చెప్పారు సంజయ్. ‘‘ఈరోజు వీళ్లిద్దరి మధ్య ఉన్న మంటను మనం తియ్యగా మార్చేస్తాం’’ అంటూ నిఖిల్, గౌతమ్‌ను కలిపేశారు సంజయ్. వాళ్లిద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ హగ్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో సరదా కబుర్లు చెప్పారు సంజయ్. ముందుగా ఎవరికి మటన్ అంటే బాగా ఇష్టమని అని అడగగానే అవినాష్ లేచి నిలబడ్డాడు. ‘‘నాకు తెలుసు నీకు మటన్, బగారన్నం అంటే ఇష్టమని’’ అని సంజయ్ అనగానే మటన్ తినడాన్ని ఊహించుకొని హ్యాపీగా ఫీలయ్యాడు అవినాష్.
రోహిణి స్మార్ట్‌నెస్
ఆ తర్వాత నబీల్, విష్ణుప్రియాతో కలిసి ఒక ఫన్నీ స్కిట్ చేశారు సంజయ్. ఆపై వారితో క్విజ్ ఆడారు. ‘‘పసుపును ఇంగ్లీష్‌లో ఏమంటారు’’ అని అడగగానే వెంటనే యెల్లో అని స్మార్ట్‌గా సమాధానం చెప్పింది రోహిణి. అయితే అడిగింది కలర్ గురించి కాదు అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా తప్పు సమాధానం చెప్పాడు అవినాష్. ‘‘ఉప్పుకు తెలుగులో ఇంకొక పదం ఉంది’’ అని సంజయ్ అనగానే వెంటనే లవనం అని సమాధానమిచ్చింది రోహిణి. అయితే తనకు అసలు తెలుగులో ఇంకొక పదం ఉందనే తెలియదని చెప్పింది ప్రేరణ. ‘‘అందులో లవ్ ఉంది. అది తనకు రావడం లేదు. అందుకే ఆ పేరు గుర్తుపెట్టుకుంది రోహిణి’’ అని కౌంటర్ ఇచ్చారు సంజయ్.