Vasundhara.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీ (Manchu Family)
లో సంక్షోభం నెలకొంది. మోహన్ బాబు (Mohan babu).చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) తండ్రి పైనే న్యాయ పోరాటం చేస్తూ.. ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పరస్పరం దాడులు చేసుకోవడమే కాకుండా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారు. గాయాలతో మనోజ్ ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ తర్వాత తన ఇంట్లోనే తనకు భద్రత లేదని డీజీపీ , డీజీ లను కలిసి మంచు మనోజ్ దంపతులు.. తిరిగి మోహన్ బాబు నివాసం ఉంటున్న జల్ పల్లి ఫామ్ హౌస్ కి చేరుకోవడంతో.. వీరిని మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో అక్కడ పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది.
ఆస్తి తగాదాలతో వార్తలో నిలుస్తున్న మంచు ఫ్యామిలీ..
ఇక దీనికి తోడు ఇటీవల తిరుపతి సంక్రాంతి సందర్భంగా .. డెయిరీ ఫామ్ దగ్గర కూడా చోటు చేసుకున్న ఘటనలో కూడా.. పరస్పరం పోలీస్ కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు. అలాగే మంచు మనోజ్ తన ఆస్తులను ఆక్రమించి, అనుభవిస్తున్నాడని వెంటనే ఖాళీ చేయించాలని మోహన్ బాబు కలెక్టర్ కు వినతిపత్రం అందించడంతో.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మెజిస్ట్రేట్ హోదాలో మోహన్ బాబు, మనోజ్ లను కలెక్టర్ విచారించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుటే ఇద్దరు దూషించుకున్నారు. తన ఆస్తులతో మనోజ్ కి సంబంధం లేదని, తన ఆస్తులను వదిలేసి మనోజ్ వెళ్లిపోవాలని మోహన్ బాబు కోరారు. ఇలా తండ్రి కొడుకుల మధ్య రోజుకొక వార్త తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉండగా.. ఇప్పుడు మరొక ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
బ్రాహ్మణిని కొట్టిన మనోజ్.. మందలించిన వసుంధర..
అదేంటంటే బాలకృష్ణ (Balakrishna ) పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి (Nara Brahmani) ని మనోజ్ కొట్టడంతో వసుంధర (Vasundhara) మనోజ్ ను మందలించిందట. మరి ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన ఇప్పటిది కాదట. అసలు విషయంలోకి వెళ్తే.. సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) కుటుంబంతో మోహన్ బాబుకు బలమైన సంబంధం ఉండేది.. అన్నగారు అంటూ మోహన్ బాబు ప్రేమగా సంబోధించేవారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలు కూడా తరచూ కలుస్తూ ఉండేవట. అటు బాల్యంలో బ్రాహ్మణిని మనోజ్ ఒక విషయంలో కొట్టారట. ఈ విషయం తెలిసిన వసుంధర అలా చేయడం తప్పు అని మనోజ్ ను మందలించిందట.
అన్ స్టాపబుల్ షోలో బయటపెట్టిన బాలయ్య..
అయితే ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బయటపెట్టారు.బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ (Un Stoppable) లో ఒక ఎపిసోడ్ కి మోహన్ బాబు, మంచు విష్ణు(Manchu Vishnu), మంచు లక్ష్మి (Manchu Lakshmi) గెస్ట్లుగా వచ్చారు. అప్పుడు మాటల్లో ఈ ఘటన చర్చకు వచ్చింది. ఇక బాల్యంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు కొంతమంది మళ్ళీ బయటకు తీసి వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.
మంచు మనోజ్ సినిమాలు..
ఇకపోతే ఇటీవలే భూమా మౌనిక (Bhooma Mounika) ను రెండో వివాహం చేసుకున్న ఈయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే నారా రోహిత్(Nara Rohith), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai Srinivas) తో కలిసి ‘భైరవం’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. మరొకవైపు సోలో హీరోగా కూడా కొన్ని ప్రాజెక్ట్లను సెట్ పై ఉంచారు మంచు మనోజ్.