Anil Kumble: భారత మాజీ కెప్టెన్ , కోచ్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) గురించి తెలియని వారండరు. అప్పట్లో టీమిండియా స్పిన్ విభాగానికి హెడ్ గా ఉండేవారు అనిల్ కుంబ్లే. అయితే.. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు భారత మాజీ కెప్టెన్ , కోచ్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) . అయితే.. తాజాగా కుంబ్లే సాధించిన ఓ అరుదైన రికార్డు ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డుకు నేటితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తరుణంలోనే..అప్పటి వీడియో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫిబ్రవరి 7, 1999న ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ( Pakisthan ) 10 వికెట్లు తీసి మంత్రముగ్ధులను చేసి చరిత్ర సృష్టించాడు భారత మాజీ కెప్టెన్ , కోచ్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) . 1956లో ఆస్ట్రేలియాపై 53 పరుగులకు 10 వికెట్లు తీసిన ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ లేకర్ తర్వాత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా కుంబ్లే ( Anil Kumble ) నిలిచాడు.
Also Read: Sara Tendulkar: రగిలిపోతున్న సారా….గిల్ కు ఇవ్వాల్సిన ముద్దులు ఆమెకు?
ఢిల్లీ వేదికగా చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే
1999 సంవత్సరంలో ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులోనే అనిల్ కుంబ్లే ( Anil Kumble ) 10 వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్ లో మొదట 420 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ చాలా భయంకరంగా బ్యాటింగ్ చేసింది. వికెట్ కోల్పోకుండా ఏగంగా 100కు పైగా పరుగులు చేసింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ చేతిలో టీమిండియా కు ఓటమి తప్పదని అందరు అనుకున్నారు. ఇలాంటి నేపాధ్యంలోనే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) రంగంలోకి దిగాడు. పాకిస్తాన్ భరతం పట్టాడు.
Also Read: Virat Kohli: టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కోహ్లీ వచ్చేస్తున్నాడు!
వరుస పెట్టి వికెట్లు తీయడం ప్రారంభించాడు అనిల్ కుంబ్లే ( Anil Kumble ). ఈ దెబ్బకు పాకిస్తాన్ ఆటగాళ్లు అసలు… ఒక్క బంతి టచ్ కూడా చేయలేకపోయారు. అందరూ చూస్తుండగానే 10 వికెట్లు తీశాడు అనిల్ కుంబ్లే ( Anil Kumble ). దీంతో పాకిస్తాన్ 207 పరుగులకే కుప్పకూలడం జరిగింది. ఈ ఇన్నింగ్స్ లో 26.3 ఓవర్లు వేసిన అనిల్ కుంలే 74 పరుగులు ఇచ్చి ఏకంగా పదవి వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే ( Anil Kumble ) విజృంభణతో టీమిండియా ఈ మ్యాచ్ లో 212 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టి మొత్తంగా… ఈ టెస్ట్ మ్యాచ్ లో 14 వికెట్లు పడగొట్టాడు అనిల్ కుంబ్లే ( Anil Kumble ). ఈ దెబ్బకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు కుంబ్లే. ఇక తన కెరీర్ లో మొత్తంలో… 619 వికెట్లు పడగొట్టాడు కుంబ్లే.
ANIL KUMBLE MADE HISTORY "OTD IN 1999"…!!!! 🙇
By taking a 10-wicket haul in an innings against Pakistan in a Delhi Test Match – The Historic Moments in Indian Cricket. 🫡 pic.twitter.com/7x0C24TiaU
— Digital Hunt 247 (@digitalhunt247) February 7, 2025