Balakrishna : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య పేరు వినగానే ఫ్యాన్స్ కు పునకాలు వస్తాయి. ఇక థియేటర్లలో బొమ్మ కనిపిస్తే దద్దరిల్లిపోవాల్సిందే. తన పవర్ ఫుల్ డైలాగులతో ఫ్యాన్స్ కు పునకాలు రావడం పక్కా.. అలాంటి బాలయ్య మంచి మనసు గురించి అందరికి తెలుసు.. అలాగే ఆయన కోపం గురించి కూడా అందరికీ తెలుసు. కొన్ని సందర్భాలలో ఆయన జనాలపై మండిపడిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గానే అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి అయినా జనాలపై కోప్పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్నటివరకు కూల్ గా ఉన్న బాలయ్య కోపం మళ్లీ పెరగడంతో ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. అది కూడా తనతో ఫోటోతో దిగిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.. అసలు బాలయ్య కోపానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సీనియర్ హీరో నందమూరి తారకరామారావు.. స్వగ్రామం నిమ్మకూరన్న విషయం అందరికీ తెలిసిందే. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరుకు గురువారం ఆయన వెళ్లారు. అక్కడ తన స్నేహితులతో సరదాగా మాట్లాడారు. అలాగే అభిమానులను పలకరించారు.. బాలయ్య వచ్చారన్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. బాలయ్యతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే నిమ్మకూరులో ఓపికగా అందరితో బాలకృష్ణ ఫోటోలు దిగారు. ఇక్కడే ఓ సంఘటన జరిగింది. అయితే బాలయ్యకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోవడం కష్టమే అన్న విషయం తెలిసిందే..
Also Read : నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం.. అతని మరణంతో..
అసలు విషయానికొస్తే.. ఎన్టీఆర్ భార్య , బాలయ్య తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. ఆయన నిమ్మకూరుకు వచ్చినట్లు తెలుసుకున్న కొమరవోలు గ్రామస్థులు అక్కడికి వచ్చారు. అందరితో సరదాగా మాట్లాడిన బాలయ్య ఫోటోలు దిగి నవ్వుతూ పలకరించారు. అయితే ఈ సందర్భంగా నిమ్మకూరు ప్రజలు తమను కూడా పట్టించుకోమని అడిగారు. అయితే బాలయ్య ఆ మాట వినగానే కోపంతో రగిలిపోయాడు. ఆయనకు ఏదైనా వచ్చిన ఆపడం కష్టమే అన్న విషయం తెలిసిందే. అలాగే వారి మాటలు విన్న బాలయ్య నేను పట్టించుకోను అని సమాధానం చెప్పాడు. ఆ మాట వినగానే అక్కడ వాళ్లంతా షాక్ అయ్యారు. తర్వాత ఏమి మాట్లాడకుండా తన ఫ్రెండ్స్ తో సరదాగా నవ్వుతూ మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి గురించి ఆయన చేసిన సేవలు గురించి గొప్పగా చెప్పారు బాలయ్య. తన తండ్రికి భారతరత్న అవార్డు కూడా రాబోతుందని అక్కడ ప్రజలతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టు తాండవం సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…