22 Years Of Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun).. ఇది పేరు కాదు ఇదొక బ్రాండ్.. ఇండస్ట్రీలోకి రావడానికి మెగా ఫ్యామిలీ అనే వృక్షాన్ని ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చి.. ఆ తర్వాత తన నటనతో , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఒక సినిమాకు మించి మరొక సినిమా.. కథల ఎంపిక విషయంలో అద్భుతమైన జడ్జిమెంట్.. అటు నిర్మాతలకి కూడా కాసుల వర్షం కురిపించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని ..నేడు ఐకాన్ స్టార్ గా నిలిచారు అల్లు అర్జున్. అభిమానులు బన్నీ అని ముద్దుగా పిలుచుకునే ఈయన.. నేడు ట్రెండ్ సెట్టర్గా మారిపోయారు.ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టారు. తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేసింది మాత్రం అల్లు అర్జున్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ‘దంగల్’ సినిమా రూ.2వేల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నంబర్ వన్ మూవీ గా నిలవగా.. ఆ మూవీని ఢీకొట్టే ప్రయత్నం చేసి, ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ తో రెండవ చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించారు.
ఇండస్ట్రీకి 22 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్..
అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరో అందుకోని తొలి జాతీయ అవార్డును కూడా.. ఉత్తమ నటుడు క్యాటగిరీలో అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తన సినిమాలతో, ఆటిట్యూడ్ తో నయా ట్రెండ్ సెట్ చేసిన బన్నీ.. ఈ ఏడాదికి ఇండస్ట్రీలోకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన తన జీవితం లో ఎదుర్కొన్న స్వీయ అనుభవాలు, విజయాలు, పరాజయాలు, అవమానాలు , అపనిందలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.’గంగోత్రి’ సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం.. ఇప్పుడు ‘పుష్ప2’ వరకూ.. ఈ 22 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు.. ఎత్తు పల్లాలు చవిచూసి నేడు ఎవరికి అందని ఎత్తుకు చేరుకున్నారు. ఇక నేడు బన్నీ గురించి స్పెషల్ స్టోరీ మీకోసం..
Shruti Haasan: మళ్లీ ప్రేమలో పడిన శృతి… ఆ డైరెక్టర్ పై ప్రేమ వొలకబోస్తూ
గంగోత్రి నుండి పుష్ప2 వరకూ..
2003లో కే రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) దర్శకత్వంలో రూపొందిన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్. ఈ సినిమాలో ఈయన నటన, లుక్కు పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ ని పాజిటివ్ గా తీసుకుంటూ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ.. నేడు అగ్ర హీరోలలో ఒకరిగా ఎదిగారు అల్లు అర్జున్.. ఆ తర్వాత వరుస జయాలు, అపజయాలతో ముందడుగు వేసిన ఈయన.. 2021లో సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో విడుదలైన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అంతేకాదు ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. గత ఏడాది ‘పుష్ప 2’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన ఈయన.. అదే సమయంలో ఆ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా మహిళ మృతితో ఆయనపై పడరాని మచ్చ పడిపోయిందనే చెప్పాలి. 22 ఏళ్ల కష్టానికి ఆయన క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ చేసిన కామెంట్లు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఒక బిల్డింగ్ రూపొందించుకున్న అల్లు అర్జున్.. ఆ ఒక్క ఘటనతో కుప్పకూలిపోయారు. అంతేకాదు ఈ ఘటనలో జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయినా సరే మళ్లీ స్టాండ్ తీసుకొని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు బన్నీ. ఏది ఏమైనా ఈయన జర్నీ చూసిన తర్వాత నెటిజన్సే కాదు మిగతా సినీ ప్రేక్షకులు కూడా ఇది కదా అసలైన విక్టరీ అంటే అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఆయనకు.. 22 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు కూడా బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం విశేషం.