Balakrishna : నందమూరి నటసింహం బాలయ్య ఈ ఏడాది డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ విషయంలో దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ కాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత మరో మాస్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఆ డైరెక్టర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
మార్కో డైరెక్టర్ తో బాలయ్య మూవీ..
ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో మార్కో ఒకటి. మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో నటించారు. ఈ మూవీని అనీఫ్ అదానీ తెరకెక్కించారు. ఈయనతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీపై అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రస్తుతం అయితే బాలయ్య ఫ్యాన్స్ ఈ కాంబోలో మూవీ కావాలని కోరుకుంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో పెద్ద ఎత్తున బడ్జెట్ తో రూపొందుతుందని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఓ ఈవెంట్ లో బాలయ్య హింట్ ఇచ్చింది దీని గురించే అయ్యి ఉంటుందని ఊహగానాలు మొదలయ్యాయి.. కాకపోతే ఇప్పుడు గోపీచంద్ మలినేని, అనీఫ్ అదానీలో ఎవరిది ముందు మొదలవుతుందనేది వేచి చూడాలి..
అఖండ తర్వాత వరుసగా చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కొత్త సినిమాల పై ఆయన లెక్క తప్పకుండ చూసుకుంటున్నాడని టాక్.. మొత్తానికి అభిమానులు మాత్రం ఇదంతా చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇవి కాకుండా బాలయ్యకు అసలైన బాధ్యత మరొకటి ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి వీలైనంత త్వరగా అనౌన్స్ మెంట్ ఇచ్చేలా చూసుకోవాలి.. ప్రశాంత్ వర్మ తప్పుకున్న తర్వాత క్రిష్ తో తన కొడుకును లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఏది ఏమైన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారన్నది వాస్తవం.
Also Read :మహేష్ కు పోటీగా మరో స్టార్ హీరో.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..!
అఖండ 2 షూటింగ్ అప్డేట్..
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మరో మాస్ మూవీ అఖండ 2.. ఈ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పై ఇండస్ట్రీలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే మరో రెండు నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసి ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ కోసం కథను రెడీ చేసి పెట్టుకున్న బాలయ్య దాని బాధ్యతలు క్రిష్ కి ఇస్తాడా లేక స్వీయ దర్శకత్వంలో చేస్తాడా? చూడాలి.. ఏది ఏమైనా బాలయ్య లైనప్ మాత్రం మామూలుగా లేదు.. కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడన్నది వాస్తవం..