BigTV English

SSMB29 : మహేష్ కు పోటీగా మరో స్టార్ హీరో.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..!

SSMB29 : మహేష్ కు పోటీగా మరో స్టార్ హీరో.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..!

SSMB29 : త్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 మూవీ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ లుక్ కూడా జక్కన్న రీవిల్ చెయ్యలేదు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అయితే ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారన్నా విషయాన్ని జక్కన్న రీవిల్ చెయ్యలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో స్టార్ హీరోను దింపబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..


‘SSMB29’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. 

ఈ మూవీని 2027 లో థియేటర్లలోకి తీసుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ ఆలస్యం కాకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేశాడు. షూటింగ్ నిర్వీరామంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నాడట. దీనిపై అగ్రిమెంట్ పూర్తయిందని అతి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట..


రెండు భాగాలుగా SSMB29.. 

రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. RRR మూవీని కూడా రెండో పార్ట్ ఉంటుందని ఇటీవలే ఓ వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఆ మూవీ కూడా ఉండబోతుందని సమాచారం. SSMB29 మూవీని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించిన రాజమౌళి, ఇప్పుడు ఒకేభాగంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే నిడివి మాత్రం 3 గంటలు పైగా వచ్చే అవకాశముందట. ఇది భారతీయ సినిమాల్లో అరుదైన మరియు సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రియాంక చోప్రాతో పాటు మరో బాలీవుడ్ క్వీన్ శ్రద్దా కపూర్ కూడా నటించనున్నట్లు సమాచారం.. త్వరలోనే ఈ మూవీ గురించి అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read :సమంత షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ హర్ట్..!

ఈ మూవీలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఉన్నాడు. మాములుగా జక్కన్న సినిమా పూర్తి అయ్యేవరకు హీరో లుక్ ను రీవిల్ చెయ్యరు. కానీ ఈ మూవీకి మాత్రం ఆయన ఆ రూల్స్ పెట్టలేదు. దాంతో మహేష్ లేటెస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇకపోతే మూవీని త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటివరకు జక్కన్న సినిమాలు ఓ రేంజులో ఉండేవి.. మరి ఈ మూవీతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×